హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుస్సేన్‌సాగర్‌లో కరోనావైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తల అధ్యయనం: మరో రెండు చెరువుల్లోనూ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌తో పాటు తెలంగాణలోని రెండు సరస్సుల్లో కరోనావైరస్ ఉన్నట్లు కనుగొన్నామని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ), హైదరాబాద్ అండ్ ది అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్(ఏసీఎస్ఐఆర్) ఘజియాబాద్ తమ అధ్యయనంలో తేల్చాయి.

50 మంది ఉద్యోగులకు కరోనా వచ్చినా 24X7 పనిచేస్తున్నాం: భారత్ బయోటెక్ సుచిత్ర ఎల్లా50 మంది ఉద్యోగులకు కరోనా వచ్చినా 24X7 పనిచేస్తున్నాం: భారత్ బయోటెక్ సుచిత్ర ఎల్లా

హుస్సేన్ సాగర్‌తోపాటు మరో రెండు చెరువుల్లో కరోనావైరస్ గుర్తింపు

హుస్సేన్ సాగర్‌తోపాటు మరో రెండు చెరువుల్లో కరోనావైరస్ గుర్తింపు

టైమ్స్ ఇండియాలో ప్రచురితమైన కథనం ప్రకారం.. హుస్సేన్ సాగర్ తోపాటు పెద్ద చెరువు(నాచారం చెరువు), నిజామ్ తాలాబ్(తుర్క చెరువు)ల్లో కరోనావైరస్ గుర్తించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. తాజా అధ్యయనంలో మరికొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి.

నీటి ద్వారా కరోనావైరస్ వ్యాపించదు..!

నీటి ద్వారా కరోనావైరస్ వ్యాపించదు..!

ఈ జలాశయాల్లో కరోనావైరస్ ఉన్నప్పటికీ.. నీటి ద్వారా కరోనావైరస్ వ్యాపించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌతికంగానే(నోరు, విసర్జిత పదార్థాల ద్వారానే) కరోనావైరస్ వ్యాప్తి జరుగుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. ఫిబ్రరి నెలలోనే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన సంకేతాలు ఉన్నాయని తెలిపింది. అంతకుముందు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఎనిమిది ఏసియాటిక్ సింహాలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అయితే, జంతువుల ద్వారా కరోనావైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి రుజువులు లేవని పేర్కొంది.

తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం

తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం


మరోవైపు తెలంగాణలో కరోనావైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 4693 కరోనా కేసులు నమోదు కాగా, 33 మంది మహమ్మారి బారినపడి మరణించారు. గత ఏడురోజులుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. గత 24 గంటల వ్యవధిలో 6876 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో వెయ్యి లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 734 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,917 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, మే 12 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపునిచ్చారు. మే 12 నుంచి పది రోజులపాటు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది.

English summary
A study conducted by scientists of the Indian Institute of Chemical Technology (IICT) and Centre for Cellular and Molecular Biology (CCMB), Hyderabad and the Academy of Scientific and Innovative Research (AcSIR), Ghaziabad has revealed that coronavirus has been found in Hussain Sagar and two other lakes in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X