హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి

|
Google Oneindia TeluguNews

టెక్ జమానాలో డేటింగ్, మ్యాట్రిమోని యాప్స్‌కు పెరిగిన ఆదరణను ఆసరగా చేసుని.. పెళ్లి కాని యువకులే టార్గెట్ గా వలపు వల విసురుతూ.. లక్షల రూపాయాల్లో మోసాలకు పాల్పడుతోన్న కంత్రీ జంటను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి పెడదారులు పట్టిన ఆ జంట, వారి చేతిలో మోసపోయిన బాధితుల తాలూకు వివరాలను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు..

విజయవాడ జంట..

విజయవాడ జంట..


ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన కంపా హృదయానంద్‌ (30), అనూష అలియాస్ హారిక (20) భార్యాభర్తలు. 2017లో వీళ్లకు పెళ్లి జరిగింది. అంతకుముందే హారిక మరొక వ్యక్తిని పెళ్లాడి, విడాకులు కూడా తీసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత కూడా ఆమె కాపురం సజావుగా సాగలేదు. ఆమె భర్త హృదాయనంద్ అనారోగ్యం పాలవడంతో ఏ పనీ చేయడం లేదు. దీంతో..

కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతోకన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో

హైదరాబాద్‌కు మకాం..

హైదరాబాద్‌కు మకాం..


కుటుంబాన్ని పోషించుకునేందుకు హారిక భర్తతో కలిసి హైదరాబాద్‌ కు మకాం మార్చింది. సిటీలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉద్యోగంలో ఉద్యోగంలో చేరింది. కానీ ఆ జీతం దేనికీ సరిపోయేది కాదు. అర్జెంటుగా అవసరాలు తీరిపోయేలా.. ఈజీగా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా? అని భార్యాభర్తలిద్దరూ ఆలోచించారు. అప్పుడే వీరి మైండ్‌లో ఓ కన్నింగ్ ఐడియా తట్టింది. అదే డేటింగ్ యాప్. ఇక ఆలస్యం చేయకుండా..

నకిలీ ఫొటోలతో ప్రొఫైల్..

నకిలీ ఫొటోలతో ప్రొఫైల్..

డేటింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్న ఆ జంట.. ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా హారికా హృదయానంద్‌ పేరిట ఓ ఫేక్‌ ప్రొఫైల్‌ తయారుచేసి గుర్తుతెలియని అందమైన యువతి సెక్సీ ఫొటోతో ‘ఇండియన్‌ డేటింగ్‌.కామ్‌' అనే వెబ్‌సైట్‌లో పోస్టుచేశారు. హారిక ప్రొఫైల్ చూసి.. సిటీకే చెందిన డోనాల్డ్‌ హోరసీస్‌ రోజారియో అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆమెతో డేటింగ్ కు సిద్ధమయ్యాడు..

బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు<br />బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు

డొనాల్డ్: ది సాఫ్ట్ వేర్ బకరా

డొనాల్డ్: ది సాఫ్ట్ వేర్ బకరా

నగరంలోని నెరేడ్ మెట్ ప్రాంతంలో నివసించే డొనాల్డ్ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. లక్షల్లో సంపాదన. ఈ విషయాలను పసిగట్టిన హారిక జంట అతణ్ని మెల్లగా ముగ్గులోకి దింపింది. భార్య హారిక చేస్తున్నట్లుగా హృదయానందే యువకులతో చాటింగ్ చేసేవాడు. పెళ్లి చేసుకుందామని డొనాల్డ్ నమ్మించిన హారిక జంట.. గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి శస్త్రచికిత్సకు ఆర్థికసాయం కావాలని అడిగారు. అసలే సాఫ్ట్ వేర్ ఇంజనీర్, పైగా కాబోయే భార్య అడుగుతోందనే కనికరంతో డొనాల్డ్ డబ్బులు పంపించాడు. ఆ తర్వాత..

అమ్మ చనిపోయింది.. నెత్తిన టోపి

అమ్మ చనిపోయింది.. నెత్తిన టోపి

తల్లికి ఆపరేషన్ పేరుతో డొనాల్డ్ నుంచి డబ్బులు గుంజిన హారిక జంట.. కొన్ని రోజులకు తల్లి చినిపోయిందని బాదితుణ్ని నమ్మించారు. మరోసారి, తన సోదరి వైద్య ఖర్చుల కోసం డబ్బులు పంపమని అడిగారు. అప్పుడు కూడా సాఫ్ట్ వేర్ మేనేజర్ డొనాల్డ్ ఎంతో కనికరంతో ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించాడు. అలా పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.21 లక్షలు చెల్లించాడు. విడతలా వారీగా డబ్బులు ఇస్తూపోతున్నా, విషయం ఎంతకూ పెళ్లి దాకా వెళ్లకపోవడం, వివాహం పేరెత్తినప్పుడల్లా హారిక వాయిదా వేస్తూ రావడంతో అప్పుడుగానీ డోనాల్డ్ అనుమానించలేదు..

విజయవాడకు జంప్.. రాచకొండ పోలీస్ ఎట్రీ..

విజయవాడకు జంప్.. రాచకొండ పోలీస్ ఎట్రీ..


డేటింగ్ వెబ్ సైట్ ద్వారా పరిచయమైన హారిక హృదయానంద్ చేతిలో మోసపోయానని గ్రహించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డొనాల్డ్ ఎట్టకేలకు రాచకొండ సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మోసగాళ్ల కోసం వేట మొదలుపెట్టారు. అప్పటికే హైదరాబాద్ లో బిచాణా ఎత్తేసి విజయవాడకు జంప్ అయిపోయింది హారిక జంట. చివరికి వాళ్ల ఆచూకీ కనిపెట్టి విజయవాడలోనే భార్యాభర్తలను అరెస్ట్ చేసి, హైదరాబాద్ తీసుకొచ్చి శుక్రవారం వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి డేటింగ్ యాప్‌లు, మాట్రిమోని సైట్లు, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు.

English summary
Police have arrested a couple for creating a fake profile on a dating app and luring unmarried teenagers to swindle millions of rupees. Kampa Hridayanand (30) and Anusha alias Harika (20) from Vijayawada were arrested by the Rachakonda police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X