హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్ డౌన్ అమలుపై పలు ఏరియాల్లో హైదరాబాద్ సీపీ సడన్ విజిట్ .. ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ .. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ విధించారు . ఇక ఈ లాక్ డౌన్ గ్రామీణ ప్రాంతాల్లోనే కచ్చితంగా అమలు జరుగుతుందని , పట్టణాలు , నగరాల్లో చదువుకున్న వాళ్ళే లాక్ డౌన్ పాటించటం లేదని తెలంగాణా పోలీసుల సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అమలు ఎలా కొనసాగుతుంది అని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ పలు ప్రాంతాల్లో సడన్ విజిట్ చేశారు .

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ అమలును పరిశీలించేందుకు పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ పలు ఏరియాల్లో పర్యటించారు. ముఖ్యంగా ఆయన వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఆసిఫ్‌నగర్‌ , హుమాయూన్‌నగర్‌ , మాసబ్‌ట్యాంక్‌ , బంజారాహిల్స్‌ , పంజాగుట్ట ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను క్షేత్ర స్థాయిలో గమనించారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు .

Hyderabad CP Sudden Visit in several areas on the implementation of the lockdown

కొన్ని చోట్ల సోషల్‌ డిస్టెన్స్‌ సరిగా పాటించటం లేదని గుర్తించిన హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో జనాలు అనవసరంగా రోడ్లమీదకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇక అలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు . అలాంటి వారిపై కఠినచర్యలు తప్పవని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసినప్పుడే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందని సీపీ అంజనీ కుమార్ అభిప్రాయపడ్డారు . సోషల్‌ డిస్టెన్స్‌పై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటేనే తమను తాము కరోనా బారి నుండి కాపాడుకుంటారని ఆయన వెల్లడించారు.

English summary
Hyderabad Police Commissioner Anjani Kumar visited various areas to monitor the implementation of the lockdown in Hyderabad. In particular, he toured the West Zone under Asifnagar, Humayunnagar, Massabtank, Banjarahills and Panjagutta and observed the situation there. He also educated people on Maintenance of Social Distance in many areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X