హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case encounter:సీపీ సజ్జనార్ వీర కన్నడిగ, హుబ్బళి పులి, డిసెంబర్ లోనే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బెంగళూరు: హైదరాబాద్ దీశపై హత్యాచారం కేసులో నరరూప రాక్షసులు నలుగురిని ఎన్ కౌంటర్ చేయడంతో సైబరాబాద్ పోలీసు కమీషనర్ వీసీ సజ్జనార్ ను సోషల్ మీడియాలో హీరో చేశారు. వీసీ సజ్జనార్ అసలు పేరు విశ్వనాథ్ సజ్జనార్. విశ్వనాథ్ సజ్జనార్ కర్ణాటకలోని హుబ్బళి నివాసి. నేడు సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ వీర కన్నడిగ. దిశ హత్యాచారం కేసులో నరరూప రాక్షసులను ఎన్ కౌంటర్ చేసిన విశ్వనాథ్ సజ్జనార్ సోషల్ మీడియాలో హీరోనే కాదు దేశంలోని ఆడపడుచుల గుండెల్లో నిజంగా దేవుడు అయ్యారు. హుబ్బళి పులి విశ్వనాథ్ సజ్జనార్ అంటూ కన్నడ మీడియా సైతం ఆయను ఆకాశానికి ఎత్తేస్తుంది. నాడు వరంగల్ ఎన్ కౌంటర్, నేడు హైదాబాద్ దిశ హత్యాచారం కేసు ఎన్ కౌంటర్. రెండు ఎన్ కౌంటర్ల డిసెంబర్ నెలలోనే కేవలం నాలుగు రోజుల తేడాతో జరిగాయి. చూడటానికి అమాయకంగా ఉండే సీపీ సజ్జనార్ ను నేడు రెండు రాష్ట్రాల తెలిగింటి ఆడపడుచులతో పాటు దేశ వ్యాప్తంగా మహిళా లోకం సాహో సజ్జనార్ అంటోంది.

Recommended Video

Disha Issue : Hatsaaf CP Sajjanar || Jayaho Telangana Police || Oneindia Telugu

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

హుబ్బళి పులి సజ్జనార్

హుబ్బళి పులి సజ్జనార్

సైబరాబాద్ పోలీసు కమీషనర్ (సీపీ) విశ్వనాథ్ సజ్జనార్ IPS నిజంగా నేడు హీరో అయ్యారు. విశ్వనాథ్ సజ్జనార్ సొంత ఊరు కర్ణాటకలోని హుబ్బళి నగరం. హుబ్బళిలో ఎంతో అమాయకంగా తిరిగే విశ్వనాథ్ సజ్జనార్ ఎంతో కష్టపడి ఐపీఎస్ అధికారి అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల పని చేసిన సీపీ సజ్జనార్ సొంత ఊరు కర్ణాటకలోని హుబ్బళి అని చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే దిశ హత్యాచారం కేసులో కిరాతకులను ఎన్ కౌంటర్ చెయ్యడంతో దేశ వ్యాప్తంగా సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ ఒక్కసారిగా హీరో అయ్యారు.

దటీజ్ సీసీ విశ్వనాథ్, సజ్జనార్ క్రేజ్ అంటే !

దటీజ్ సీసీ విశ్వనాథ్, సజ్జనార్ క్రేజ్ అంటే !

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు కిరాతకులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులు నేడు హీరోలు అయ్యారు. ముఖ్యంగా సీపీ విశ్వనాథ్ సజ్జనార్ ఆడపడుచులు, అమ్మాయిల గుండ్లెల్లో దేవుడు అయ్యారు. శంషాబాద్ సమీపంలోని చటాన పల్లి దగ్గర శుక్రవారం వేకువ జామున దిశ నిందితులను ఎన్ కౌంటర్ చెయ్యడంతో సీసీ సజ్జనార్ నేడు సోషల్ మీడియాలో క్రేజ్ సంపాధించుకున్నారు. సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

2008 డిపెంబర్ సీన్ అదే డిసెంబర్ లో రిపీట్ చేసిన సజ్జనార్

2008 డిపెంబర్ సీన్ అదే డిసెంబర్ లో రిపీట్ చేసిన సజ్జనార్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో 2008 డిసెంబర్ లో వరంగల్ లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేసిన స్వప్నిక, ప్రణీత స్కూటర్ మీద వెలుతున్న సమయంలో శ్రీనివాస్ అనే కిరాతకుడు అతని స్నేహితులతో కలిసి యాసిడ్ దాడి చేశాడు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వరంగల్ జిల్లా ఎస్పీగా విశ్వనాథ్ సజ్జనార్ ఉన్నారు. యాసిడ్ దాడిలో తీవ్రగాయాలైన స్వప్నిక చికిత్స విఫలమై ఆసుపత్రిలో మరణించింది. స్వప్నికా, ప్రణీతల యాసిడ్ దాడి కేసు పర్యవేక్షించిన సజ్జనార్ ఈ కేసులోని కిరాతకులను డిసెంబర్ 10వ తేదీ ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడే అదే విశ్వనాథ్ సజ్జనార్ సైబరాబాద్ సీపీగా పని చేస్తున్నారు. 2008 డిసెంబర్ 10వ తేదీ సీన్ రిపీట్ చేసిన సీపీ విశ్వనాథ్ సజ్జనార్ 2019 డిసెంబర్ 6వ తేదీన మళ్లీ వరంగల్ ఎన్ కౌంటర్ ను చటాన పల్లిలో రిపీట్ చేశారు.

సజ్జనార్ నాడి పట్టుకోవడం కష్టం

సజ్జనార్ నాడి పట్టుకోవడం కష్టం

దిశ హత్యాచారం కేసులో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే మొదటి నుంచి పోలీసు అధికారి విశ్వనాథ్ సజ్జనార్ ఎక్కడా తొందరపాటుగా, ఎవ్వరికీ భాదకలింగించే విధంగా మాట్లాడలేదు. దిశ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్చలు తీసుకుంటారని మాత్రమే సజ్జనార్ ఇన్ని రోజులు చెప్పారు. అయితే నేడు సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మీకు సెల్యూట్ సజ్జనార్ సర్

మీకు సెల్యూట్ సజ్జనార్ సర్

సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ నేడు సోషల్ మీడియాలో హీరో అయ్యారు. విశ్వనాథ్ సజ్జనార్ పేరు నేడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉదయం నిద్రలేవగానే దిశ హత్యాచారం కేసు నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారని చల్లటి వార్త తెలుసుకున్నాం, మీకు నిజంగా సెల్యూట్ సర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సజ్జనార్ ను చేతులు జోడించి నమస్కరిస్తున్నామని కోందరు పోస్టు చేశారు. భవిష్యత్తులో ఇంటి ఘటనలకు పాల్పడాలని ఎవరికైనా ఆలోచన వస్తే ఈ సంఘటన గుర్తు పెట్టుకోండి అంటూ పలువురు సోషల్ మీడియాలో కామాంధును హెచ్చరిస్తున్నారు.

English summary
Hyderabad Veterinary doctor rape case all four accused have been killed in an encounter with the police. Karnataka Hubballi base Vishwanth Sajjanar behind the encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X