హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు నీటి కష్టాలు.. ఆ నాలుగు రోజులు వాటర్ సప్లై బంద్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆ నాలుగు రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 26వ తేదీ సోమవారం నుంచి 29వ తేదీ గురువారం వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్‌కు రిపేర్లు, కృష్ణా మొదటి దశ పైప్ లైన్ భారీ లీకేజీకి మరమ్మతులు వెరసి హైదరాబాద్‌లో ఆ నాలుగు రోజుల పాటు మంచినీటి కష్టాలు తప్పేలా లేవు. కొన్ని ప్రాంతాల్లో 26, 27 తేదీల్లో నీటి సరఫరాకు బ్రేక్ పడనుండగా.. మరికొన్ని ఏరియాల్లో 28,29 తేదీల్లో తాగు నీటి సప్లైకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

నాలుగు రోజులు నీటి కష్టాలేనా..!

నాలుగు రోజులు నీటి కష్టాలేనా..!

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆగస్టు 26 వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు నగర వాసులకు ఇబ్బందికరంగా మారనుంది. వివిధ ఏరియాల్లో తేదీల వారీగా నీటి సరఫరా బంద్ కానుంది. 26, 27 తేదీల్లో కొన్ని ప్రాంతాలు.. 28,29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఎదురుకానున్నాయి. ఆ మేరకు ఆ నాలుగు రోజులు వాటర్ సప్లై ఉండబోదని జలమండలి అధికారులు వెల్లడించారు.

గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌ బెడ్‌కు నీటి తరలింపులో పైప్ లైన్‌ కాలువ మరమ్మతులు, అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌ క్లీనింగ్‌ దృష్ట్యా 26, 27 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని వెల్లడించారు జలమండలి అధికారులు.

<strong>ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!</strong>ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!

26, 27 తేదీల్లో వాటర్ రాని ప్రాంతాలు ఇవే..!

26, 27 తేదీల్లో వాటర్ రాని ప్రాంతాలు ఇవే..!

26, 27 తేదీల్లో తాగునీటి సప్లై నిలిచిపోనున్న ప్రాంతాలను చూసినట్లయితే.. ఎస్‌ఆర్‌టీ, జవహర్‌నగర్‌, పీఎన్‌టీ కాలనీ, సాయన్న గల్లీ, అశోక్‌ నగర్‌, జ్యోతి నగర్‌, వినాయక్‌ నగర్‌, మైసమ్మ బండ.. ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌, సెక్రటేరియట్‌, రెడ్‌హిల్స్‌, హింది నగర్‌, గోడెకీ కబర్‌, గన్‌ఫౌండ్రీ, దోమల్ గూడ, లక్డీకాపూల్‌.. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి.. ఏసీ గార్డ్స్‌, ఖైరతాబాద్‌, మల్లెపల్లి, బోయిగూడ కమాన్‌, అజాంపురా, నాంపల్లి, దేవిబాగ్‌, అఫ్జల్‌ సాగర్‌, సీతారాంబాగ్‌, హబీబ్‌ నగర్‌.. కాకతీయ నగర్‌, సాలార్ జంగ్‌ కాలనీ, పార్ట్‌ పద్మనాభ నగర్‌, కుందన్ బాగ్‌, వినయ్‌ నగర్‌ కాలనీ, చింతల్‌బస్తీ, హుమాయున్‌ నగర్‌, సయ్యద్‌ నగర్‌ తదితర ప్రాంతాలున్నాయి.

28, 29 తేదీల్లో వాటర్ రాని ప్రాంతాలు ఇవే..!

28, 29 తేదీల్లో వాటర్ రాని ప్రాంతాలు ఇవే..!

ఇక 28, 29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై బంద్ కానుంది. బండ్లగూడ దగ్గర హైద‌రాబాద్‌కు కృష్ణాన‌ది నుంచి డ్రింకింగ్ వాటర్ త‌ర‌లిస్తున్న కృష్ణా వాటర్ మొదటి దశ పైప్ లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడింది. అయితే దానికి మరమ్మతులు చేపట్టే క్రమంలో మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తనున్నాయి. లీకేజీలు నివారించడానికి రిపేర్లు చేయిస్తుండటంతో మెయిన్‌టెయినెన్స్ కింద తాగునీటి సరఫరా బంద్ చేయనున్నారు జలమండలి అధికారులు. 28వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తెలిపారు.

ఈ రెండు రోజుల్లో తాగునీటి సప్లై నిలిచిపోనున్న ప్రాంతాలను చూసినట్లయితే.. బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, హింది నగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం, చిలకలగూడ.. సైదాబాద్, అస్మాన్ ఘాడ్, చంచల్ గూడ, యాకుత్ పుర, మలక్ పేట్, మూసారాంబాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌.. అలియాబాద్, మిరాలం మండి, కిషన్ బాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్, వినయ్ నగర్ తదితర ప్రాంతాలున్నాయి.

English summary
For the residents of the Hyderabad to be face drinking water problems. Water supply to several areas will be suspended from Monday 26 th to Thursday 29 th. Repairs to the Asif Nagar Filter Bed, Krishna's First Phase Pipe Line Repairs With Heavy Leakage For Four Days In Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X