హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది.
ఈ నెల 19న సాయంత్రం 5గంటలకు మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తారని రెండు రోజుల క్రితమే అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది.

కాగా, కొద్దిరోజుల క్రితమే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. దాదాపు రూ.184కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45-ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేయనుంది. దీని పొడవు 754.38మీ. కాగా.. వెడల్పు ఆరు లేన్లు ఉంటుంది. ఎల్&టీ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించింది. దేశంలో కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం.

hyderabad durgam cheruvu cable bridge inauguration postponed

పాదాచారులు,సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ రాత్రి సమయంలో బ్రిడ్జి అందాలను రెట్టింపు చేయనుంది. ఈ బ్రిడ్జిపై రాకపోకలను ప్రారంభించనప్పటికీ... ఇప్పటికీ ఎంతోమంది సందర్శకులు ప్రతీరోజూ ఇక్కడికి వచ్చిపోతున్నారు. రాత్రిపూట జిగేల్ కాంతుల నడుమ బ్రిడ్జి పైనుంచి చెరువు అందాలను వీక్షిస్తూ మైమరిచిపోతున్నారు. ఒకరకంగా నగరంలో ఇది కూడా ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ బోటింగ్, రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేసే యోచనలో టూరిజం శాఖ ఉన్నది.

ఒకప్పుడు కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ నవాబులకు మంచి నీరందంచిన చరిత్ర దుర్గం చెరువుకు ఉన్నది. దాదాపు 83 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు దేశంలోని రహస్య తటాకాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది.

English summary
Durgam Cheruvu cable bridge inauguration was postponed,next date will be confirm by officials soon. Just two days before officials announce that Telagnana IT minister KTR will be inaugurate durgam cheruvu cable bridge on September 19th in Hyderabad.The cable bridge works were completed few days back,it become like a one of the tourist spot in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X