హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ ‘వరదల’నగరం: కొట్టుకుపోయిన జనాలెందరో! ఏం జరిగింది(వీడియోలు)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad Heavy Rains Exclusive Videos

హైదరాబాద్: నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రహదారులు మొత్తం జలమయం కాగా.. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 నైరుతి తిరోగమనం.. అయినా 10 రోజులు భారీ వర్షాలు: పాతికేళ్ల తరువాత తొలిసారిగా..! నైరుతి తిరోగమనం.. అయినా 10 రోజులు భారీ వర్షాలు: పాతికేళ్ల తరువాత తొలిసారిగా..!

కొట్టుకుపోయిన వృద్ధుడు

కొట్టుకుపోయిన వృద్ధుడు

కాగా, ఇటీవల యూసఫ్‌గూడలోని కృష్ణానగర్ వద్ద ఓ వృద్ధుడు వరదనీటిలో కొట్టుకెళ్లిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి.. కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. అప్పటికే వరదనీరు భారీగా వస్తుండటంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

ఏం జరిగింది?

అయితే, ఆ వ్యక్తి ఎవరు? ఆ తర్వాత ఆయన సురక్షితంగా బయటపడ్డారా? లేదా? అనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ఘటనలు కూడా మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే నగరంలో తరచూ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ మండిపడుతున్నారు.

నగరం జలమయం..

ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ప్రాంతంలో భారీ వర్షాలకు వరదనీరు చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. ప్రజలకు తమ గమ్య స్థనాలకు, కార్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్టాప్ మొత్తం నీటిలో మునిగిఉండటం గమనార్హం.

ఫ్లైఓవర్ పైనా భారీ వరద ఎలా?

ఫ్లైఓవర్ పైనా భారీ వరద ఎలా?


నగరంలో కురిసిన భారీ వర్షాలకు ఫ్లైఓవర్లపైనా వరద నీరు చేరుకోవడం గమనార్హం. ఫైఓవర్‌పైనా వరద నీరు ఈ స్థాయిలో ఎలా చేరిందంటూ నెటిజన్లూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది హైదరాబాదీలకు కష్టసమయమేనంటూ వాపోయారు.

వరదలో కొట్టుకుపోయారు..

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. నదీ ప్రవాహం మాదిరిగా రోడ్లపై వరద నీరు ఎంతో వేగంగా పరుగులు తీసింది. దీంతో వాహనదారులు తమ వాహనాలను కాపాడుకునేందుకు పెద్ద యుద్ధమే చేశారు. ఈ ప్రయత్నంలో కొందరు వరదనీటిలో కొంత దూరం వరకు కొట్టుకుని పోయారు.

నిలువనీయని వరద..

నగరంలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలు నగరవాసికి నిద్ర లేకుండా చేశాయి. ఇంటి నుంచి కార్యాలయాలకు, కార్యాలయాల నుంచి ఇంటికి చేరుకునేందుకు నగరవాసులు అష్టకష్టాలు పాడాల్సి వచ్చింది. రహదారులన్నీ నదీ ప్రవాహాలను తలపించాయి. ఉస్మాన్‌గంజ్ ఇటీవల కురిసిన వర్షాల వరదలకు ఓ వ్యక్తి ఇలా కొట్టుకుపోయాడు. చివరకు మరో వ్యక్తి సాయంతో బయటపడ్డాడు.

English summary
Hyderabad Hit by Torrential Rains: Several people floated in floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X