హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంత దారుణమా: బాబోయ్.. కరోనా పేషెంట్‌కు ఆ హాస్పిటల్ వేసిన బిల్లు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తమ దృష్టికి వస్తున్న సమస్యల పరిష్కారానికై అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాదు కరోనావైరస్ పేషెంట్లకు నాణ్యమైన చికిత్సను అందించాలని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్‌కు హుకూం జారీచేసింది. మరోవైపు కరోనావైరస్‌ చికిత్సకు సంబంధించి పలు ప్రైవేట్ హాస్పిటల్స్ అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం టెస్టుల నుంచి బెడ్ ఛార్జీల వరకు కొన్ని ధరలు నిర్ణయిస్తూ పరిమితి విధించింది.

ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా ప్రభుత్వం విధించిన పరిమితి దాటి పేషెంట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. కానీ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు ఇవేమీ పట్టడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పెడచెవిన పెట్టి కేవలం డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ పీపీఈ కిట్‌కు ఏకంగా లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది.

 డేంజర్‌లో తెలంగాణ జిల్లాలు: కరోనావైరస్ కాటుకు బలయ్యే అవకాశాలు ఎక్కువ: స్టడీ డేంజర్‌లో తెలంగాణ జిల్లాలు: కరోనావైరస్ కాటుకు బలయ్యే అవకాశాలు ఎక్కువ: స్టడీ

రోజుకు లక్ష రూపాయలు బిల్

రోజుకు లక్ష రూపాయలు బిల్

కరోనావైరస్ ఎంతటి కల్లోలాన్ని సృష్టిస్తోందో చూస్తున్నాం. ఓ వైపు కరోనా సోకి ఊపిరందక పేషెంట్లు బాధపడుతుంటే.. వారి నుంచి డబ్బులు అధికంగా వసూలు చేసి బతికుండగానే వారిని మానసికంగా చంపేస్తున్నాయి కొన్ని హాస్పిటల్స్. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఓ వ్యక్తి కరోనావైరస్ పాజిటివ్‌తో అడ్మిట్ అయ్యాడు. ఎనిమిది రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడలేకపోయారు. మొత్తం 8 రోజులకు గాను ఆ హాస్పిటల్ రూ.8లక్షల బిల్లు వసూలు చేసింది.

పీపీఈ కిట్లకు రూ. 2.23 లక్షలు

పీపీఈ కిట్లకు రూ. 2.23 లక్షలు


బిల్లు అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. 246 పీపీఈ కిట్ల కోసం అక్షరాల రూ.2.23 లక్షలు బిల్లు వేయడం చూసి షాక్ అయ్యారు. ఒక్కో కిట్‌కు రూ. 910 వసూలు చేశారు. అయితే ఒక్క పేషెంట్ కోసం ఇన్ని పీపీఈ కిట్లు వినియోగించడంపై మృతుడి కుటుంబ సభ్యులు హాస్పిటల్ యాజమాన్యంను ప్రశ్నించగా ఎవరూ సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం విధించిన పరిమితిని అతిక్రమించి రోజుకు రూ. లక్ష వసూలు చేయడమే కాకుండా పేషెంట్‌ను కాపాడలేకపోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బంజారా హిల్స్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఇదంతా జరిగింది.

Recommended Video

Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu
 ప్రభుత్వం విధించిన ధరలు ఇవీ

ప్రభుత్వం విధించిన ధరలు ఇవీ

కరోనావైరస్‌కు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స కోసం ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఐసొలేషన్ వార్డులో చికిత్సకు అయితే రోజుకు రూ. 4వేలు ఫిక్స్ చేయగా... ఐసీయూలో చికిత్స కోసం రోజుకు రూ. 7500గా నిర్థారించింది. అదే ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తే రోజుకు రూ. 9000 నిర్ణయించింది ప్రభుత్వం. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 2341 పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ పడకలు ఖాళీగా లేవని పేషెంట్లను వెనక్కు పంపించేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే పేషెంట్లపై అరాచకత్వాన్ని ప్రదర్శిస్తూ అధిక చార్జీలు వసూలు చేస్తున్న మూడు హాస్పిటల్స్‌ను హైదరాబాదులో గుర్తించడం జరిగింది. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ హాస్పిటల్స్ పై దర్యాప్తు చేసింది.

English summary
Hyderabad hospital charge Rs 2.2 lakh for 246 PPE kits for treating coronavirus patient, the total bill was at Rs 8 lakh for eight days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X