• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉద్యోగం కావాలంటే న్యూడ్ ఫోటోలు పంపు.. యువతికి హెచ్ఆర్ పేరిట వేధింపులు

|

హైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని ఆసరాగా చేసుకుని కొందరు దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తున్నారు. అదే కోవలో హైదరాబాద్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. మియాపూర్‌కు చెందిన ఓ యువతి ఫోన్ నంబర్ సంపాదించిన ప్రదీప్ అనే యువకుడు ఉద్యోగం పేరిట వల వేశాడు. నగరంలో ప్రముఖ హోటల్ లో రిసెప్షనిస్టు జాబ్ ఉందంటూ కాల్ చేశాడు. అప్పటికే ఆ యువతికి అనుమానం వచ్చి.. నా నెంబర్ మీకెక్కడిదంటూ నిలదీసింది. అయితే ఓ జాబ్ పోర్టల్ నుంచి తీసుకున్నానంటూ నమ్మించాడు. సరే కావొచ్చులే అనుకుని ఆ యువతి అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే ఆ యువతికి ఉద్యోగం అవసరం ఉందని భావించిన ప్రదీప్ ఆమెను ట్రాప్ చేశాడు.

ఆ తర్వాత రోజు అర్చన అనే మహిళ సదరు యువతికి ఫోన్ చేసింది. అనంతరం వాట్సాప్ ద్వారా ఇంటర్వూ ప్రక్రియ ముగించింది. అది అయిపోయిన తర్వాత మీరు మొదటి రౌండ్ లో సెలెక్టయ్యారు అంటూ కాల్ వచ్చింది. అయితే మీకు ఆ ఉద్యోగం కావాలంటే మీ నగ్నచిత్రాలు పంపించాలని కండిషన్ పెట్టింది. మొదట ఆ యువతి ఒప్పుకోకపోయినా.. పదేపదే కాల్ చేస్తూ తాను చూసిన వెంటనే డిలీట్ చేస్తానంటూ అర్చన ఆమెను నమ్మించింది. అంతేకాదు నీకు ఉద్యోగం అక్కర్లేదంటే.. వేరేవాళ్లకు ఇస్తానంటూ దబాయించింది. అయితే తనతో మాట్లాడుతున్న అవతలి వ్యక్తి మహిళనే కావడంతో చివరకు సరే అని ఒప్పుకుంది ఆ యువతి. ఆ మేరకు వాట్సాప్ లో తన నగ్న చిత్రాలు పంపింది.

hyderabad kukatpally woman trapped and torchered in the name of hr

పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!

అక్కడ సీన్ కట్ చేస్తే.. తొలుత తనతో మాట్లాడిన ప్రదీప్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ యువతికి ఫోన్ చేస్తూ నగ్న చిత్రాల గురించి వర్ణించడమే గాకుండా అసభ్యకరమైన పదజాలంతో వేధించాడు. దాంతో తాను మోసపోయాయని గ్రహించిన సదరు యువతి షీ టీమ్స్ ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్‌ షీటీమ్స్‌ బృందం నిందితులు ప్రదీప్, అర్చనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad's Kukatpally woman trapped in the name of HR. One Person named pradeep called a woman for job requirement. She Accepted his proposal, then he entered other woman named archana to ask her nude photos. She sent her nude photos to such people. Then they cheated and pradeep called her with abused language. Atlast the woman came to know that she cheated and given a police complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more