హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లాస్మా దానం చేయడం వల్ల బలహీనపడతారా? ఆరుసార్లు డొనేట్: దాత ఏం చెబుతున్నారు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్లాస్మా డొనేషన్. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విస్తృతంగా వినిపిస్తోన్న పేరు ఇది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన ప్ల్మాస్మాతో మరో కరోనా రోగి ప్రాణాన్ని నిలబెట్టడానికి అవకాశం ఉంది. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఏకంగా ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన పోలీసు కానిస్టేబుళ్లు, సిబ్బందితో ప్లాస్మా డొనేషన్ కోసం చైతన్యవంతులను చేస్తున్నారు. ప్లాస్మా డొనేషన్‌పై ఉద్యమానికి అద్భుత స్పందన వస్తోంది.

Recommended Video

వన్ ఇండియా ప్రత్యేకం: ఆరుసార్లు ప్లాస్మాదానం చేసిన శ్రీకాంత్ ఏమంటున్నారు..?

మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు.. తమవంతు బాధ్యతగా ప్లాస్మా డొనేషన్ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సైబరాబాద్ పోలీసులకు సహకరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా ఆరుసార్ల వరకు ప్లాస్మాను దానం చేసిన వారు ఉన్నారు. ప్లాస్మాను దానం చేయడం వల్ల శారీరకంగా బలహీనులుగా మారుతారనే అపోహలకు తెర దించుతున్నారు. ఎన్నిసార్లయినా ప్లాస్మాను డొనేట్ చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. దానికి నిదర్శనంగా నిలుస్తున్నారు దాతలు. సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ ఉద్యమం.. సామాన్య ప్రజలను సైతం ప్లాస్మా డొనేషన్ వైపు మొగ్గు చూపేలా చేస్తోంది.

Hyderabad Man donates plasma six times, says awareness should increase on Plasma therapy

షాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్.. ఇప్పటికి ఆరుసార్లు తన ప్లాస్మాను దానం చేశారు. మృత్యువు కోరల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను నిలబెట్టడానికి కృషి చేశారు. షాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్.. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. స్నేహితుడి నుంచి ఆయనకు కరోనా వైరస్ సోకింది. కరోనా బారిన పడిన ఆయన స్నేహితుడి నుంచి తొలి కాంటాక్ట్ వ్యక్తి శ్రీకాంత్ అయ్యారు. దగ్గు, జ్వరంతో బాధపడిన ఆయన వైద్య పరీక్షలను నిర్వహించుకోగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.

అనంతరం ప్లాస్మా దానం గురించి తెలుసుకున్నారు. దానిపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకున్నారు. ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధపడ్డారు. వారానికి రెండుసార్లు ప్లాస్మా డొనేట్ చేసే అవకాశం ఉందని, ఆరోగ్య దృష్ట్యా గాంధీ ఆసుపత్రి డాక్టర్ల సూచనలతో 15 రోజులకు ఒకసారి ప్లాస్మాను దానం చేశానని అన్నారు. ప్లాస్మాను దానం చేయడం వల్ల బలహీనపడతారనడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. ఇకముందు కూడా డాక్టర్లు తనను సంప్రదిస్తే.. ప్లాస్మాను డొనేట్ చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోన్న శ్రీకాంత్‌తో మా ప్రతినిధి భాను ఫేస్ టు ఫేస్.. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

English summary
A man named Srikanth from Hyderabad has donated plasma six times and said that social awareness is what is all important.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X