హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిస: లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య, భార్యకు సెల్ఫీ వీడియో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయిన ఓ వ్యక్తి.. అప్పుల ఊబిలోకి కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్ లైన్‌లో గేమ్స్ ఆడుతూ అప్పులపాలైన జగదీశ్ అనే యువకుడు అవి తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన జగదీశ్(34) డయాగ్నొస్టిక్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఆయన ఆన్‌లైన్ గేమ్స్‌పై డబ్బులు పెడుతుండేవాడు. గతంలో దాదాపు రూ. 12 లక్షలు నష్టపోతే జగదీశ్ తండ్రి ఈ అప్పులను తీర్చాడు.

Hyderabad: Man ends life after losing money in online games

తాజాగా, మళ్లీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ రూ. 15 లక్షలు నష్టపోయాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బలవన్మరణానికి పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసి విషయాన్ని వెల్లడించాడు.

తనను క్షమించాలని కోరుతూ తన భార్యకు ఆ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. జగదీశ్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

English summary
Hyderabad: Man ends life after losing money in online games.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X