హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో బంపర్ ఆఫర్: 40 నుంచి 50 శాతం రాయితీ, కారణమిదేనా..?

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా.. ఆపై మాంద్యం.. ప్రజా రవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేషన్, సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాలు లేవు. కానీ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కూడా ఆఫర్ ప్రకటించింది. తెలంగాణలో పెద్ద పండుగలు బతుకమ్మ, దసరా నేపథ్యంలో శుభవార్త తెలిపింది.

Recommended Video

#Telangana : Hyderabad Metro Announces Festival Offers To Passengers || Oneindia Telugu
మెట్రో రాయితీ..

మెట్రో రాయితీ..

దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని మెట్రో రాయితీ ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వరదలతో నగరవాసులు అల్లాడుతున్న సమయంలో రాయితీలు ప్రకటించడం శుభపరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. శనివారం నెలాఖరు వరకు మెట్రో ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు.

 40 నుంచి 50 శాతం

40 నుంచి 50 శాతం

ప్రయాణికుల భద్రత విషయంలో మెట్రో ముందు ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. స్మార్ట్ కార్డు, ట్రిప్ కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వ‌ర‌కు ప్ర‌త్యేక రాయితీ క‌ల్పించామ‌న్నారు. 40 శాతం రాయితీ కాకుండా ట్రిప్ కార్డులు కొన్న‌వారికి 2 నెల‌ల వ‌ర‌కు రాయితీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

 30 రోజుల్లో 20 ట్రిప్పులు..

30 రోజుల్లో 20 ట్రిప్పులు..

14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం ఉంటుంది. 20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే ఛాన్స్ ఇస్తారు. 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం ఉంటుంది. 7 ట్రిప్పుల‌కు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే ఛాన్స్ ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

గర్భిణీ తరలింపు

గర్భిణీ తరలింపు

భారీ వర్షం కురిసిన రోజు గర్భిణి కోసం ప్రత్యేకంగా మెట్రో రైలు నడిపినట్లు తెలిపారు. విక్టోరియల్ స్టేషన్ నుంచి మియాపూర్‌ మెట్రో రైలు నడిపి ఆ మహిళను ఇంటికి పంపించామని ఆయన వివరించారు.

English summary
hyderabad metro festival offer to passengers. concession to 40 percent to 50 per cent in ticket fare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X