హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె కోసం మెట్రో.. వెయ్యి మందిని గమ్యస్థానానికి చేర్చేదీ.. ఒకరి కోసం..

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. ఒకరి కోసం సర్వీస్ చేసే పరిస్థితి ఉంటోంది. అందులో గర్భిణీ కోసం అయితే తప్పకుండా సేవలు అందించాల్సిందే. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. మెట్రో రైలును గర్భిణీ ఒకరు కోసం నడిపించింది సంస్థ.

ఈ నెల 14వ తేదీన గర్భిణీ విక్టోరియా మెమోరియల్ స్టేషన్ చేరుకున్నారు. తాను మియాపూర్ వెళ్లాలని.. తనకు ఇతర రవాణా ఏదీ లేదని మెట్రో సిబ్బందికి తెలియజేసింది. ఆమె వినతికి మన్నించిన సిబ్బంది.. ఒకరి కోసం మెట్రో రైలును నడిపారు. అయితే నిబంధనల ప్రకారం రాత్రి 9 గంటలకు మెట్రో సేవలను నిలిపివేస్తారు. కానీ ఆ మహిళ రాత్రి 10 గంటలకు స్టేషన్ చేరుకున్నారు. మియాపూర్‌లో దింపాలని కోరడంతో.. ప్రత్యేక రైలును నడిపించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Hyderabad Metro Rail runs special train to pregnant lady

14వ తేదీ అంతకుముందు రోజు సిటీల వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాస్తవానికి రోజుకు ఒక ట్రిప్ వెయ్యి మందిని మెట్రోలో రలిస్తారు. కానీ కరోనా వల్ల 60 శాతం సామర్థ్యంతో రన్ అవుతోంది. కానీ ఒక ట్రిప్ మాత్రం గర్భిణీ కోసం నడిపించారు.

కరోనా వైరస్ వల్ల 4 నెలలు మెట్రో సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7వ తేదీన సేవలను పునరుద్ధరించారు. దీంతో ప్రస్తుతం రోజుకు లక్ష మంది ప్రయాణికులను మెట్రో తీసుకెళుతోంది. కరోనా వైరస్ వల్ల కొన్ని కార్యాలయాలు తెరచుకోలేదు. దీంతో సాప్ట్ వేర్ సహా ఇతర సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.

English summary
lady reached the Victoria Memorial station on October 14 night and told the metro rail personnel that she had to get to Miyapur and that there was no other transport available.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X