హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబుల్ అయిన మెట్రో ప్రయాణికులు... సర్వీసులు పెంపు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం నడుస్తున్న రెండు కారిడార్లలో రైళ్లన్ని రద్దీగా మారాయి. దీంతో అదనపు రైళ్లను నడుపుతున్నారు. సాధరణ రోజుల్లో ఉదయం ప్రయాణించే సంఖ్య కంటే ఈరోజు అదనంగా ఉన్నారని మెట్రో ఎండీ తెలిపారు. సాధరణ రోజుల్లో ఉదయం పదిలోపు 42 వేల మంది ప్రయాణించేవారని కాని నేడు మాత్రం 78 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పారు.

ఆర్టీసి కార్మికులు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా పలు నిర్ణయాలు తీసుకుంది.. ఇప్పటికే కార్మీకులను సమ్మె విరమించాలని విజ్ఝప్తి చేసిన కమిటీ అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఆర్టీసీలో ఉన్న 2100 అద్దె బస్సులను నడపుతామని తెలిపారు. మరోవైపు నగర ప్రయాణికులకు ఇబ్బంది కల్గకుండా సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్‌, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్‌ చేయొద్దని మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన మెట్రో అధికారులు మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచారు.

 Hyderabad Metro Trains have become crowded

దీంతో ఉదయం 5.30 నుండే మెట్రో సర్వీసులను ప్రారంభించారు. సాధరణ రోజుల్లో చివరి మెట్రో రాత్రి 11 గంటలకు కొనసాగనుండగా అదనంగా మరో గంటన్నర సమయాన్ని పెంచారు. దీంతో రాత్రి 12.30 వరకు వీటిని కొనసాగించనున్నట్టు ఎండీ తెలిపారు. ఇందుకోసం ఎనిమిది వందలకు పైగా ట్రిప్పులు వేయనున్నట్టు ఎండీ ఎన్వీస్ రెడ్డి చెప్పారు.

English summary
Hyderabad Metro Trains have become crowded in the two corridors. Additional trains are running because strick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X