హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముస్లిం మహిళల కోసం జిమ్ సెంటర్.. ట్రైనర్, ఫిజీషియన్ కూడా..

|
Google Oneindia TeluguNews

ఈ రోజుల్లో జిమ్ సెంటర్ తప్పనిసరి. యువతకు అయితే ఎక్కడో ఓ చోట ఉంటాయి. మరీ మహిళల సంగతి.. వారికి కూడా జిమ్స్ ఉంటున్నాయి. అయితే ముస్లిం మహిళలకు మాత్రం కష్టం. ఎందుకంటే వారు బురఖా ధరిస్తారు. వారికి సాధారణ జిమ్ సెంటర్లలో వెళితే కాస్త ఇబ్బందే.. ఎందుకంటే ఇతరులు చక్కగా జిమ్ చేస్తే..వారు మాత్రం బురఖాతో జిమ్ చేయాల్సి ఉంటుంది. దీనిని గమనించిన ఓ మసీదు ముస్లిం మహిళల కోసం ఏకంగా జిమ్ సెంటర్ ప్రారంభించారు.

Recommended Video

CLP Leader Bhatti Vikramarka Lashes out At CM KCR and TRS Govt | Oneindia Telugu
మహిళల కోసం జిమ్

మహిళల కోసం జిమ్

రాజేంద్రనగర్‌‌, వాదీ మహమూద్ ప్రాంతంలోని మస్జీద్-ఏ-ముస్తఫాలో ఈ జిమ్‌‌ను ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్ఈఈడీ అనే స్వచ్ఛంద సంస్థ ఆర్థిక చేయూతను అందించింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మసీదు కమిటీతో కలసి వెల్‌నెస్ సెంటర్ నిర్వహణను చూసుకుంటోంది. ఇక్కడికి చాలా మంది ముస్లిం మహిళలు వస్తున్నారు.

నిపుణులు ట్రైనింగ్

నిపుణులు ట్రైనింగ్

రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల ముస్లిం మహిళల కోసం జిమ్ ఏర్పాటు చేశారు. నిపుణుల ట్రైనింగ్‌తో జిమ్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిది.. సిటీలో గల మురికివాడల్లో ఉంటోన్న వారికి జిమ్ వల్ల మేలు కలుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. జిమ్ చేయడం వల్ల సంక్రమిత వ్యాధుల బారి నుంచి రక్షించడానికి వీలవుతోంది. అసలే కరోనా, స్ట్రెయిన్ టెన్షన్ నెలకొంది. దీంతో శరీరం నుంచి చెమట వస్తేనే మేలు జరుగుతుంది. అందుకోసమే జిమ్ ఏర్పాటు చేశారు.

ప్రొఫెషనల్ ట్రైనర్

ప్రొఫెషనల్ ట్రైనర్

జిమ్‌‌లో ప్రతిరోజూ సెషన్‌‌ల వారీగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు ప్రొఫెషనల్ విమెన్ ట్రెయినర్‌‌ను కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఓ ఫిజీషియన్‌‌తోపాటు హెల్త్ కౌన్సెలర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ముస్లిం మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వారికి రోజూ ట్రైనర్లు శిక్షణ కూడా ఇస్తున్నారు. అందరూ బురఖాలో ఉండటంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా.. శిక్షణ కొనసాగుతోంది.

English summary
hyderabad mosque open gym for women in rajendra nagar area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X