హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె ఫోన్లో 'యాప్'.. వాడి ఫోన్లో "ట్రాప్".. యువతిని లొంగదీసుకుని వికృత చేష్టలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అరచేతిలో ప్రపంచం ఏమోగానీ, స్మార్ట్ ఫోన్ల కారణంగా మంచి కంటే అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ కారణంగా ఏది కావాలన్నా మొబైల్ ఫోన్ల ద్వారా క్షణాల్లో పొందగలుగుతున్నారు నేటి యువతరం. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మోసాలకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో వెలుగుచూసిన ఘటన చర్చానీయాంశంగా మారింది. అమ్మాయి ఫోన్లో యాప్ ఇన్‌స్టాల్‌ చేసి.. తద్వారా తన ఫోన్లోకి ఫోటోలు వచ్చేలా చేసుకుని మోసం చేసిన ప్రబుద్ధుడి బాగోతం బయటపడటం యువతులను భయాందోళనకు గురిచేస్తోంది.

యాప్ తో ట్రాప్.. లైంగిక వేధింపులు

యాప్ తో ట్రాప్.. లైంగిక వేధింపులు

ముషీరాబాద్‌కు చెందిన సాయితేజ అలియాస్ సన్నీ అనే యువకుడి మోసానికి ఓ యువతి బలైంది. బీఫార్మసీ చదువుతున్న తన సోదరి స్నేహితురాలైన యువతితో పరిచయం పెంచుకుని బరి తెగించాడు. ఆ అమ్మాయికి తెలియకుండానే ఆమె ఫోన్లో AVS అనే యాప్ ఇన్‌స్టాల్‌ చేశాడు. ఆమె ఫోన్లోని సమాచారం తన ఫోన్ నెంబరుకు వచ్చేలా ఆప్షన్ పెట్టుకున్నాడు. అయితే ఈ యాప్ ద్వారా ఫోన్ కెమెరాకు ఎదురుగా ఉన్న ప్రతీ దృశ్యం రికార్డవుతుంది. అలా ఆ యువతికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆమెకు తెలియకుండానే ఆ దుర్మార్గుడి ఫోన్లోకి చేరాయి.

లేడీస్ స్పెషల్.. మహిళల కోసం, మహిళల చేత 'మెట్రో' ఎగ్జిబిషన్లేడీస్ స్పెషల్.. మహిళల కోసం, మహిళల చేత 'మెట్రో' ఎగ్జిబిషన్

మూడుసార్లు అబార్షన్

మూడుసార్లు అబార్షన్

కొన్ని సందర్భాల్లో ఆమెకు తెలియకుండానే క్యాప్చరయిన ప్రైవేట్ ఫోటోలు.. వాడి ఫోన్లోకి చేరాయి. అలాంటి ఫోటోలు సేవ్ చేసుకుని వాటిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ యువతికి చూపించి బెదిరించాడు. లైంగిక వాంఛ తీర్చాలని.. లేదంటే ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెడతానంటూ చుక్కలు చూపించాడు. ఏంచేయాలో పాలుపోక వాడు చెప్పినట్లు విని లొంగిపోయింది. అయితే అదే అదనుగా తీసుకుని పలుమార్లు లైంగికంగా లోబర్చుకున్నాడు. మూడుసార్లు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు.

పాపం పండింది.. కటాకటాల్లోకి నిందితుడు

పాపం పండింది.. కటాకటాల్లోకి నిందితుడు

రానురాను వాడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత యువతి భరించలేకపోయింది. వాడికి ఇష్టమైన్నప్పుడు రమ్మనడం, కాదంటే మళ్లీ బెదిరించడం.. రొటీన్ గా మారింది. చివరకు వాడి వికృత చేష్టలు భరించలేక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడి నుంచి నిజాలు రాబట్టారు. AVS యాప్ ద్వారా ఆ యువతిని మోసం చేసినట్లు అంగీకరించాడు. పూర్తి ఆధారాలు దొరకడంతో నిందితుడు సాయితేజ అలియాస్ సన్నీని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

English summary
Hyderabad musheerabad guy saiteja alias sunny cheated a woman with AVS app. That app automatically capture the photos. He Installed that app in woman phone and set up to collect her personal photos and data in his phone. Showing that photos to her and wants to sex with him. Many times he called up that woman and made sex with her. At last she dared and given complaint to police. After inquiry police were arrested that guy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X