హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాం డబ్బుకు 120 మంది వారసులు, రూ. 300 కోట్లు పంపకం

|
Google Oneindia TeluguNews

Recommended Video

కొలిక్కి వచ్చిన నిజాం నిధుల కేసు

లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో గల నిజాం సంపదపై ఆయన వారసులతోపాటు భారత ప్రభుత్వానికి చెందుతుందనే తీర్పును లండన్‌లోని రాయల్‌కోర్ట్స్ ఆఫ్ జస్టీస్‌ తీర్పు వెలువరించిన తెలిసిందే...దీంతో నిజాంవారసులు ఎంతమంది ఆ సంపదను పంచుకోనున్నారు. మూడువందల కోట్ల రుపాయాల్లొ భారత ప్రభుత్వం ఏమేరకు తీసుకుంటుంది...? తీర్పు అనంతరం ఎవరెవరు ఆ సంపదను పంచుకుంటారనే ఆసక్తి నెలకొంది.

నిజాం సంపదను పంచుకోనున్న 120 మంది

నిజాం సంపదను పంచుకోనున్న 120 మంది

డెబ్బై సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత నిజాం నవాబుకు చెందిన సుమారు మూడు వందల కోట్ల రుపాయాలను ఆయన వారసులతో పాటు, భారత ప్రభుత్వం హక్కుదారు అనే తీర్పును లండన్ కోర్టు వెలువరించిన నేపథ్యంలోనే సంపద పంపీణిపై ఆసక్తి నెలకోంది. ఈనేపథ్యంలోనే నిజాం డబ్బును ఆయన వారసులతో పాటు కేసులో ప్రతివాదులుగా చేరిన మొత్తం 120 మంది పంచుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకులో దాచిన డబ్బుకోసం నిజాం మనుమలు అయిన ముకరం జా, ముఫఖ్కం జాలు ముందుగా భారత ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటం చేశారు. అనంతరం నిజాం సంపద తమకు కూడ దక్కుతుందంటూ కొంతమంది నిజాం ఎస్టెట్‌గా ఏర్పడి కేసులో ఇంప్లీడ్ అయ్యారు. దీంతో ఆ మొత్తాన్ని వారే పంచుకుంటారనే వార్తలు వెలువడుతున్నాయి.

 దేశ ప్రతిష్టకోసం పోరాడిన భారత్

దేశ ప్రతిష్టకోసం పోరాడిన భారత్

అయితే తీర్పు ప్రకారం భారత ప్రభుత్వం కూడ సంపదలో వాటాదారుగా ఉంటుంది. కాని భారత ప్రభుత్వం నిజాంకు చెందిన సంపదకన్న దేశ ప్రతిష్టకోసమే దీనిపై న్యాయస్థానంలో పోరాడినట్టు తెలుస్తోంది. ఇందుకోసమే కేసులో విజయం సాధించడం కోసం హరీష్ సాల్వే లాంటీ ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిజాం సంపదను భారత ప్రభుత్వం తీసుకునేందుకు అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.

నిజాం వారసుల్లో ఎక్కువమంది బీదలే...

నిజాం వారసుల్లో ఎక్కువమంది బీదలే...

మరోవైపు నిజాం వారసులు విదేశాల్లో ఉంటూ కేసుపై పోరాడిన నేపథ్యంలో ఆయనకు సంపందించిన మొత్తం 120 మంది నిజాం ఎస్టెట్‌గా ఎర్పడి పోరాడిన వారిలో ఎక్కువశాతం బీదరికంలో మగ్గతున్నారని తెలుస్తోంది. నిజాం వారసుల్లో కేవలం మూడు నాలుగు కుటుంబాలు మాత్రమే ధనవంతులుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నిజం డబ్బును వారే పంచుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ముందుగానే ఒప్పందం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వానికి కూడ వివరించినట్టు తెలుస్తోంది. దీంతోనే తామంతా కలిసి సంపదను పంచుకుంటామని ముకరం జా, ముఫఖం జా కుటుంబాలు కలిసి చర్చించుకుంటామని చెప్పారు. ఆయన వారసులు హైదరాబాద్‌లో ప్రకటించారు.

English summary
120 descendants have stake in Hyderabad Nizam’s funds.Nawab Najaf Ali Khan, grandson of Nizam VII Nawab Mir OsmanAliKhan Bahadur said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X