హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతి స్నానం చేస్తుండగా.. వెంటిలేటర్ నుంచి తొంగి చూసి.. హైదరాబాద్‌లో అటెండర్ వక్రబుద్ధి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : యువత చెడు మార్గంలో పయనిస్తోందనడానికి నిత్యం వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు మొదలు యువతులపై అత్యాచారాల దాకా.. కొందరు యువకులు విచక్షణ కోల్పోతున్నారనే విషయం అర్థమవుతోంది. సమాజంలో ఉంటున్నామనే విషయం మరచిపోయి వికృత చేష్టలకు పాల్పడుతుండటం అనర్థాలకు దారితీస్తోంది. మంచి కంటే చెడు వైపు ఆకర్షితులవుతూ తమ జీవితాలు పాడు చేసుకోవడమే గాకుండా తల్లిదండ్రుల పరువు బజారున పడేస్తున్నారు.

ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలోననే ఇంగీత జ్ఞానం మరిచిపోయిన ఓ యువకుడు దారి తప్పాడు. పక్కింట్లో ఉండే యువతి స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి తొంగి చూశాడు. సదరు యువతి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్‌పేట పరిధిలోని మూసారంబాగ్ డివిజన్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.

hyderabad person arrested for seeing from windows young girl doing bath

యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలంయువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం

అపార్టుమెంటులోని మూడో అంతస్తులో ఓ కుటుంబం నివసిస్తోంది. బాలానగర్ ఏరియాలోని ఫతే నగర్ కు చెందిన 37 సంవత్సరాల శివకుమార్ పిళ్లై అనే యువకుడు అదే ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అటెండర్‌గా పనిచేస్తున్న శివకుమార్ పిళ్లై ఈ నెల 26వ తేదీన పక్కింటి యువతి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి తొంగి చూశాడు.

ఆకస్మాత్తుగా ఆమె దృష్టి వెంటిలేటర్ వైపు మళ్లడంతో విషయం బయటపడింది. షాక్‌కు గురైన ఆ యువతి కేకలు వేయడంతో శివకుమార్ పరారయ్యాడు. కేసు ఫైల్ చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవి ఫుటేజ్ పరిశీలించడంతో నిందితుడి లీలలు వెలుగుచూశాయి. స్టూల్ వేసుకుని బాత్‌రూమ్‌లోకి తొంగి చూసినట్లుగా విజువల్స్ రికార్డయ్యాయి. ఆ మేరకు అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

English summary
Hyderabad Police Arrested One Person for indecent manner. When his Neighbour woman taking bath, he saw from ventilator. She observed and given complaint to police. They were arrested accused person and sent to remand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X