హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్‌లో బంగారం పట్టివేత.. బెదిరించి స్ల్మగ్లింగ్ చేయించారంటూ ఆవేదన...!

|
Google Oneindia TeluguNews

వారంత బంగారం స్మగ్లర్లు, రెండు కోట్ల రుపాయల బంగారాన్ని జెడ్డా నుండి స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ట్విస్ట్ ఏంటంటే పట్టుపడ్డ బంగారం మాది కాదని చెబుతున్నారు. తాము ఉమ్రాకు వెళ్లిన నేపథ్యంలో అక్కడి స్మగ్లర్లు బంగారం తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారని , లేదంటే ఉమ్రా యాత్రకు వచ్చారంటూ స్థానిక పోలీసులకు అప్పచెబుతామని బెదిరించారని చెబుతున్నారు. దీంతో స్మగ్లింగ్‌లో ట్విస్ట్ కొనసాగుతోంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ పోలీసులతోపాటు డిఆర్ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈనేపథ్యంలోనే జెడ్డా నుండి వచ్చిన 14 మందిని కూడ అరెస్ట్ చేశారు..కాగా అరెస్ట్ చేసిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారు కావడం గమనార్హం. దీంతో పట్టుపడ్డ నిందితులు చెబుతున్న వివరాలు ట్విస్ట్‌ కొనసాగుతుంది.

hyderabad police and DRI seized 6.46kg

పాతబస్తికి చెందిన 14 మంది ఉమ్రా యాత్రకు వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడంతో స్థానిక బంగారం స్మగ్లింగ్ ముఠాలు తమను బెదిరించి బంగారం స్మగ్లింగ్ చేయాలని బెదిరించి పంపించినట్టు వారు చెప్పారు.లేదంటే ఉమ్రా పోలీసులకు అప్పజెప్పుతామని అందుకే తాము బంగారాన్ని తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో చెప్పారు..దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు.

English summary
in a joint operation by hyderabad police and DRI international passengers who came from Jeddah after completion of Umrah, were intercepted at RGI Airport on uesday late night and seized 6.46kg of alleged smuggled gold. Some travel agents blackmailed and forced these passengers to smuggle gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X