హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డేంజరస్ గ్యాంగ్ : అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పరిధిలో చోరీలకు పాల్పడుతున్న బీహార్ అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి భారీ ఎత్తున నగలు,డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1కోటి వరకు ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ముఠా వద్ద నుంచి ఓ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. బషీర్‌బాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన వివరాలు వెల్లడించారు.

ఎవరీ ముఠా...

ఎవరీ ముఠా...

పోలీసుల కథనం ప్రకారం.. ముఠాలోని సభ్యులు బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో వంట మనుషులుగా చేరారు. గతేడాది డిసెంబర్‌లో ఇంటి యజమానులు ఫంక్షన్‌కు వెళ్లగా.. 1.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్‌ నగలను చోరీ చేసి పరారయ్యారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

ఇలా పట్టుకున్నారు..

ఇలా పట్టుకున్నారు..


రెండు నెలలుగా ముఠా కోసం వెతుకుతున్న పోలీసులు ఎట్టకేలకు వీరిని పట్టుకున్నారు. నిందితులంతా బీహార్‌ రాష్ట్రంలోని మధుబని ప్రాంతానికి చెందినవారని, రామషిష్‌ ముఖియా వీరి ముఠాకు బిగ్‌బాస్ అని గుర్తించారు. ముఖియా ఆదేశాల మేరకు దొంగతనాలు చేస్తుంటారని గుర్తించారు. దొంగతనానికి పాల్పడే ముందు నెల రోజులు రెక్కీ నిర్వహించి ఓ ఇంటిని ఎంచుకుంటారని చెప్పారు.

వంట మనుషులుగా చేరి..

వంట మనుషులుగా చేరి..

రెక్కీ నిర్వహించిన ఎంచుకున్న ఇంట్లోకి ఈ ముఠా సభ్యులు వంట మనుషులుగా చేరుతారు. ఇదే తరహాలో గతేడాది బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో వంట మనుషులుగా చేరారు. ఇంట్లో వాళ్లకు నమ్మకం కలిగించేలా పనిచేశారు. ఇదే క్రమంలో ఓరోజు ఇంటి యజమానులు ఓ ఫంక్షన్‌కు వెళ్లడంతో.. అదునుచూసి దొంగతనం చేశారు. చోరీ తర్వాత బీహార్ పారిపోయారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బీహార్‌ వెళ్లి గాలించగా ఎట్టకేలకు చిక్కారు.

 డేంజరస్ గ్యాంగ్..

డేంజరస్ గ్యాంగ్..

రామషిష్‌ ముఖియాపై బీహార్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన డైమండ్‌ నగలను సిమెంట్‌తో కప్పివేసినట్టు గుర్తించారు. బంగారాన్ని అమ్మేసినట్టు చెప్పారు.
ఈ గ్యాంగ్ చాలా ప్రమాదకరమని,చోరీ సమయంలో ఎవరైనా అడ్డు వస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడరని పోలీసులు వెల్లడించారు. కేసులో A1-రామాషిష్ ముఖియా, A2-భగవత్ ముఖియా,A3-రాహుల్ ముఖియా, A4-పీతాంబర్ మండల్, A5-బోలా ముఖియా, A6-హరిష్ చంద్ర ముఖియాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.

English summary
A Bihar interstate gang has been arrested by the police for allegedly committing burglaries in the Banjara Hills area of ​​Hyderabad. Large quantities of jewelery and money were seized from the gang. Hyderabad CP Anjan Kumar said they are worth Rs 1 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X