హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు పిల్లల తల్లి.. టిండర్ యాప్‌లో యువతకు వలపు వల.. ఆపై సెక్స్ వీడియోలతో బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

ఆమె.. ఇద్దరు పిల్లల తల్లి. భర్త సాధారణ ఉద్యోగి. ప్రతి రోజూ దాదాపు రొటీన్‌గా సాగేది. కానీ అదామెకు నచ్చలేదు. లైఫ్ లో కిక్కు కావాలనుకుంది. లగ్జరీగా బతకాలని డిసైడైంది. ఈ విషయంలో భర్తతో గొడవపడి, అతనిమీద కేసులు పెట్టి, పిల్లల్ని గాలికొదిలేసి కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చేసింది. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డులో వాచ్ మెన్ గా పనిచేస్తోన్న తండ్రి దగ్గర ఉంటూ కొత్త జీవితానికి ప్లాన్లు వేసుకుంది.

చదివింది ఇంటరే

చదివింది ఇంటరే


చదివింది ఇంటరే అయినా సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వాడకంలో దిట్ట. టిండర్ యాప్ ద్వారా యువతీయువకుల్ని పరిచేయంచేసుకుని, వాళ్లతో పడకపంచుకుని, ఆపై సెక్స్ వీడియోలతో బెదిరింపులకు దిగడం, లక్షల కొద్దీ డబ్బులు గుంజడం ఆమె నైజం. తేనెపూసిన మాటలతో మైమరిపిస్తూ, పరిచయమైన ఒక్కరోజులో శారీరకంగా దగ్గరవుతుంది. ఆ తతంగాన్ని రహస్యంగా వీడియో తీసి, తన అనుచరులతో బ్లాక్‌మెయిల్‌ దందా మొదలుపెడుతుంది. చేసేది ఆమె అయినా.. తనకేం తెలియనట్లు బాధితుల పక్కనే ఉండటం ఆమె స్టైల్. గత డిసెంబర్ లోనే ఈమె లీలలు బట్టబయలుకాగా, తాజాగా ఓ తప్పుడు కేసు పెట్టి కేపీహెచ్ బీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

మహేశ్వరి అలియాస్ అమ్ములు

మహేశ్వరి అలియాస్ అమ్ములు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటకు చెందిన మహేశ్వరి అలియాస్ అమ్ములు చాలాకాలంగా కేపీహెచ్‌బీ వసంతనగర్‌ కాలనీలో నివసిస్తోంది. కొందరు వ్యక్తులు తన నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ గత వారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేశ్వరిపై అంతకుముందే చీటింగ్ కేసులు ఉండటం, జైలు నుంచి బెయిల్ పై బయటికొచ్చింది కావడంతో ఆమె ఆరోపణల్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఆమె అబద్ధాలతోపాటు గతంలో చేసిన మోసాల చిట్టా కూడా బయటపడింది.

రూ.10 లక్షలు వసూలు..

రూ.10 లక్షలు వసూలు..

టిండర్‌ యాప్‌లోని ప్రొఫైల్ లో తాను బీటెక్‌ చదివినట్లు చెప్పుకునే మహేశ్వరి.. గత డిసెంబర్‌ 15న ఓ యువకుడికి వలపువల విసిరింది. పరిచయమైన ఒక్కరోజులోనే ఇద్దరూ హోటల్‌గదిలో కలుసుకున్నారు. ఆ పని పూర్తయిన మరుసటి రోజు మళ్లీ కలసుకున్నారు. అంతలోనే సంతోష్‌ అనే వ్యక్తి.. యువకుడికి ఫోన్ చేసి.. తాను పోలీసునని, హోటల్‌ గదితో మహిళతో సెక్స్ వీడియోలు దగ్గరున్నాయని, డబ్బులివ్వకుంటే కేసు పెడతానని బెదిరించాడు. పక్కనే ఉన్న మహేశ్వరికి ఆ విషయం చెప్పగానే తనకేం తెలియనట్లు ఏడుపు నటించింది. మొత్తానికి ఆ యువకుడి దగ్గర 4.5లక్షలు లాగేశారు. వరంగల్ లో ఉంటూ లిఫ్టులు రిపేర్లు చేసే మరో యువకుడికీ వలవేసి, హైదరాబాద్ లో కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి, గదికి రప్పించుకుని, యధావిధిగా సెక్స్ వీడియోలతో బెదిరించి అతని దగ్గరా సుమారు 4 లక్షలు వసూలు చేసింది.

అమ్మాయిలనూ వదల్లేదు..

అమ్మాయిలనూ వదల్లేదు..

మోసాల్లో ఆరితేరిన మహేశ్వరి ఆడపిల్లల్ని కూడా వదిలిపెట్టేదికాదు. ఫేస్ బుక్ లో తన పేరు కృష్ణహర్షారెడ్డిగా, ఆర్డీవోగా పనిచేస్తున్నట్లుగా ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ట్రాప్ చేసింది. అదంతా నిజమని నమ్మిన సాఫ్ట్‌వేర్‌ యువతి ఆర్డీవోగా పరిచయం అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆర్డీవో పేరుతో చాటింగ్‌ చేస్తున్న మాయలేడీ.. ఒకరోజు ‘తన చెల్లి మహేశ్వరికి కొంత డబ్బు అవసరముంది, తనను నీవద్దకు పంపిస్తున్నాను.. ఎలాగైనా సహయం చేయాలి' అని ఫేస్‌బుక్‌ చాటింగ్‌లో చెప్పింది. ఆ యువతి సరే అనడంతో నిందితురాలు దర్జాగా తన అసలు పేరు మహేశ్వరిగా సాఫ్ట్‌వేర్‌ యువతి ఇంటికి వెళ్లింది. ఒకవైపు ఫేస్‌బుక్‌లో ఆర్డీవో పేరుతో, మరోవైపు లైవ్‌లో మహేశ్వరి పేరుతో రూ. 1.70 లక్షలు లాగింది. ఆ తర్వాత ఏటీఎం కార్డులు, పిన్ నంబర్లు దొంగిలించి పరారైంది. సాఫ్ట్‌వేర్‌ యువతి బంధువులు.. మహేశ్వరి జాడ కనిపెట్టి డబ్బులు తిరిగివ్వాలని గొడవ చేయడంతో కథ అడ్డం తిరిగింది.

విస్తుపోయిన పోలీసులు..

విస్తుపోయిన పోలీసులు..

అంతకుముందే జైలు నుంచి బయటకొచ్చిన మాయలేడి మహేశ్వరి.. సాఫ్ట్‌వేర్‌ యువతి బంధువులపై రివర్స్ కేసు పెట్టేందుకు ప్రయత్నించింది. తనను కొందరు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, తన నగ్న చిత్రాలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నారని కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇప్పటిదాకా రూ.10 లక్షలు కాజేసిన మహేశ్వరిని మళ్లీ కటకటాల్లోకి నెట్టేశారు.

English summary
hyderabad, kphb police arrested arrested a woman, mother of two, for allegedly extorting money from various persons, after chatting with them on dating websites and tinder like apps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X