హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కారు!! పోలీసులా పోకిరీలా ?(వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : విశ్వనగరం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతారు. కానీ మహిళలు, అదీ వైద్యులపై అనుచితంగా ప్రవర్తిస్తారు. ఔను హైదరాబాద్‌లో ఓ ఖాకీ మహిళ వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించాడు. హక్కుల కోసం ఆందోళన చేస్తున్న మహిళను కాళ్లతో తొక్కి, గోళ్లతో గిచ్చి పైశాచిక ఆనందం పొందాడు. అయితే ఖాకీ చేసిన నీచపు పని కెమెరాలో రికార్డై బండారం బయటపెట్టింది.

ఆందోళన చేస్తే ..

ఆందోళన చేస్తే ..

సిటీ నడిబొడ్డున యునానీ ఆస్పత్రి వద్ద వైద్య విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తమ ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని నిరసిస్తూ యూనానీ విద్యార్థులు నిరసన చేపట్టారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొందరినీ అరెస్ట్ చేసి బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో ఓ మఫ్టీలో ఉన్న ఖాకీ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడం కెమెరాలో రికార్డై .. సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మప్టీలో వచ్చినా ఖాకీ..

హైదరాబాద్ లోని చార్మినార్ యునాని ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. యునాని ఆస్పత్రిలోనికి తమను అనుమతించడం లేదని జూనియర్ వైద్యులు నిరసన తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఈ నిరసనకు దిగారు. విద్యార్థులకు, లెక్చరర్లు సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ధర్నా చేస్తున్న చోటికి మప్టీలో వచ్చాడో ఖాకీ. విద్యార్థినులను మిగతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటే .. అతను మాత్రం విద్యార్థిని గిల్లీ క్షణికానందం పొందాడు.

సరికాదు ..

సరికాదు ..

మరికొందరు సిబ్బంది విద్యార్థినులను అరెస్ట్ చేస్తున్నారు. ఇంతలో అక్కడికొచ్చిన ఖాకీ .. విద్యార్థినిని తాకరాని చోట తాకాడు. అంతకుముందు కాలితో తన్ని తన మూర్ఖత్వాన్ని చాటుకున్నాడు. అప్పటికే అరుస్తున్న విద్యార్థిని .. గిల్లడంతో గట్టిగా అరిచింది. నొప్పి తాళలేక కేకలు పెట్టింది. సరిగ్గా ఆ సమయంలో వీడియో కెమెరాలో రికార్డైంది. ఆ ఖాకీ కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. మరోవైపు ఈ ఘటనపై మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఏం జరిగిందంటే ..

ఏం జరిగిందంటే ..

విద్యార్థినిపై పోలీసు అనుచితంగా ప్రవర్తించినా .. ఉన్నతాధికారులు మాత్రం అదేం లేదన్నట్టుగా ప్రవర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పనిచేశామని డీసీపీ చెప్తున్నారు. ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. కావాలని గిల్లితే విధుల్లో భాగంగా అలా ప్రవర్తించి ఉండొచ్చని కొత్త భాష్యం చెప్తున్నారు. తమ హక్కుల కోసం విద్యార్థులు ఆందోళన చేయడం తప్పా ? నిరసన చేస్తే గిల్లుతారా ? ఇదే తీరు అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే కాదు గతంలో కూడా మరికొందరు పోలీసులు కూడా అనుచితంగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. యునానీ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతుంది.

English summary
Medical students and teachers at Unani Hospital took up the agitation. The government hopes to move its Ayurveda Bhavan to erra gadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X