హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద‌రాబాద్‌లో ఉగ్ర‌వాద శిబిర‌మా? కిష‌న్‌రెడ్డి చెప్పిందే నిజ‌మైందా? డీజేఎస్ క్యాంప్ సీజ్‌!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్‌: జంట‌న‌గ‌రాల్లో ఇప్ప‌టికీ ఉగ్ర‌వాద మూలాలు ఉన్నాయ‌ని, తీవ్ర‌వాద సానుభూతిప‌రులు త‌ల‌దాచుకున్నారంటూ కేంద్ర హోమ్ శాఖ స‌హాయ‌మంత్రి జీ కిష‌న్ రెడ్డి చెప్పిన మాట‌లు నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్ కేంద్రంగా దేశ‌వ్యాప్తంగా త‌న కార్య‌క‌లాపాల‌ను విస్త‌రింప‌జేసుకున్న ద‌ర్ష్‌గా-ఇ-జిహాద్‌-ఒ-ష‌హ‌ద‌త్ (డీజేఎస్‌)కు చెందిన శిక్ష‌ణా శిబిరాలు దీనికి నిద‌ర్శ‌నంగా మారాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతోన్న కార‌ణంగా ప్ర‌స్తుతం డీజేఎస్ సంస్థ దేశవ్యాప్తంగా నిషేధాన్ని ఎదుర్కొంటోంది. అయిన‌ప్ప‌టికీ.. గుట్టు చ‌ప్పుడు కాకుండా కొంత‌మంది యువ‌కుల‌ను ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల దిశ‌గా మొగ్గు చూపేలా శిక్షణ ఇస్తోందని అంటున్నారు హైద‌రాబాద్ సిటీ పోలీసులు.

ముంబై మార‌ణ‌హోమం మాస్ట‌ర్‌మైండ్ హ‌ఫీజ్ స‌యీద్ అరెస్ట్‌!ముంబై మార‌ణ‌హోమం మాస్ట‌ర్‌మైండ్ హ‌ఫీజ్ స‌యీద్ అరెస్ట్‌!

స్వీయ‌ర‌క్ష‌ణ పేరుతో..

స్వీయ‌ర‌క్ష‌ణ పేరుతో..

మార్ష‌ల్ ఆర్ట్స్‌, స్వీయ ర‌క్ష‌ణ‌, క‌ర్ర‌సాము, క‌రాటే పేరుతో డీజేఎస్ సంస్థ ప్ర‌తినిధులు కొంత‌కాలంగా పాత‌బస్తీకి చెందిన కొంత‌మంది ఎంపిక చేసిన యువ‌కుల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. సైదాబాద్ అక్బ‌ర్‌బాగ్‌లోని హ‌జ్ర‌త్ ఉజ‌లె-షా ఈద్గా గ్రౌండ్స్‌లో ఈ శిక్ష‌ణ కొన‌సాగుతోంది. నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఏ సంస్థ అయినా స‌రే! ఎలాంటి కార్య‌క‌లాపాల‌నూ చేప‌ట్ట‌కూడ‌ద‌ని చ‌ట్టం చెబుతోంది. ప్ర‌జ‌లు, ప్ర‌త్యేకించి- యువ‌త‌ను భాగ‌స్వామ్యం చేసే విధంగా త‌న కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించ‌డం చ‌ట్ట విరుద్ధం. కొంత‌కాలంగా- డీజేఎస్ సంస్థ పాత‌బ‌స్తీకి చెందిన సుమారు వెయ్యిమంది యువ‌కుల‌కు స్వీయ‌ర‌క్ష‌ణ పేరుతో శిక్ష‌ణ శిబిరాల‌ను నిర్వ‌హిస్తోంది. ఆత్మ రక్షణ కోసమే తాము ఈ శిక్ష‌ణ శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని డీజేఎస్ ప్ర‌తినిధులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఉగ్రవాద శిక్షణ ఇస్తూ డీజేఎస్ సంస్థ తమ కార్యకలాపాలను యదేచ్చగా కొనసాగిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

11వ తేదీ నుంచీ కొన‌సాగుతున్న శిక్ష‌ణ‌

11వ తేదీ నుంచీ కొన‌సాగుతున్న శిక్ష‌ణ‌

ఈ నెల 11వ తేదీ నుంచి హ‌జ్ర‌త్ ఉజ‌లె-షా ఈద్గా గ్రౌండ్స్‌లో ఈ శిక్ష‌ణ శిబిరాలు కొన‌సాగుతున్నాయి. ఈ విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టారు కిష‌న్ రెడ్డి. హైద‌రాబాద్‌లో ఉగ్రమూలాలు ఇంకా ఉన్నాయ‌ని, వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కొద్దిరోజుల కింద‌టే వెల్ల‌డించారు. దీనికి అనుగుణంగా- హైద‌రాబాద్ సిటీ పోలీసులు ఈ శిబిరాల‌పై దాడులు నిర్వ‌హించారు. ద‌ర్గా మైదానం త‌లుపులను మూసివేశారు. శిక్ష‌ణా శిబిరాన్ని మూసివేయాల‌ని ఆదేశించారు. ఆ స‌మ‌యంలో సుమారు వంద‌మంది వ‌రకు యువ‌కులు స్వీయ ర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో శిక్ష‌ణ పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. అనూహ్యంగా పోలీసులు రావ‌డం- ఈ శిక్ష‌ణా శిబిరాన్ని వెంట‌నే మూసి వేయాలంటూ ఆదేశించడం, డీజేఎస్ ప్ర‌తినిధులు దీన్ని అడ్డుకోవ‌డంతో అక్బ‌ర్‌బాగ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

పోలీసుల‌తో వాగ్వివాదం..

పోలీసుల‌తో వాగ్వివాదం..


శిక్ష‌ణ శిబిరాల‌ను మూసివేయించ‌డానికి వ‌చ్చిన సైదాబాద్ పోలీసుల‌తో సంస్థ ప్ర‌తినిధులు వాగ్వివాదానికి దిగారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే వ‌హ‌ద‌త్‌-ఇ-ఇస్లామి అధ్య‌క్షుడు మౌలానా న‌సీరుద్దీన్ పోలీసుల‌ను స‌ర్దిచెప్ప‌డానికి ప్ర‌యత్నించారు. పోలీసుల‌ను కాద‌ని ఆయ‌న ఈద్గా గ్రౌండ్స్ త‌లుపుల‌ను తెరిచి, లోనికి ప్ర‌వేశించారు. ఆయ‌న‌ను అడ్డుకోవ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నించారు. అదే సమ‌యంలో- శిక్ష‌ణలో ఉన్న యువ‌కులు గుమికూడ‌టంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. అనంత‌రం పోలీసులు వారిని శాంతింప‌జేశారు. డీజేఎస్‌పై ఉన్న నిషేధం విష‌యాన్ని గుర్తు చేశారు. డీజేఎస్ సంస్థ ఎలాంటి కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌కూడ‌దంటూ నిషేధాజ్ఞ‌లు ఉన్నాయ‌ని మౌలానా న‌సీరుద్దీన్‌కు వివ‌రించారు. సుమారు గంట స‌మ‌యం అనంత‌రం ప‌రిస్థితులు శాంతించాయి.

English summary
Mild tension prevailed on Tuesday in Saidabad after the City police shut down the martial arts training camp run by Darsgah-E-Jihad-O-Shahadat (DJS) and deployed heavy force in the area. According to reports, DJS on July 11, started a special training camp at Hazrat Ujale-Shah Eid Gah Grounds in Akbarbagh and around 100 candidates too part to get trained in Karate, and other self defense skills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X