హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drunk and Drive test:మందుబాబులు జాగ్రత్త.. భరతం పట్టేందుకు పోలీసులు రెడీ..! ఎలాగంటే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: హైదరాబాదులో మందుబాబుల పనిపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక బార్లు, పబ్బులకు అనుమతి రావడంతో వీకెండ్స్‌లో మందు కొట్టి రోడ్డెక్కుతున్న వాహనదారులను, మందుబాబుల భరతం పట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి నెలలో ముగిసిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ను తిరిగి ప్రారంభించనుంది హైదరాబాద్ పోలీస్ శాఖ.

మార్చినెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో బార్లు పబ్బులు, మద్యం దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌ చెకింగ్స్‌ను నిలిపివేశారు. తాజాగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెబుతూ పబ్బులు, బార్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పోలీసులకు మళ్లీ పనిపడింది. మే నెలలో మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు స్వల్పంగా జరిగాయి. కానీ ఈ సారి మాత్రం పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు పోలీసులు.

Hyderabad Police to conduct Drunk and Drive tests

ప్రస్తుతం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా భౌతిక దూరం పాటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు కోవిడ్ గైడ్‌లైన్స్ కూడా ఫాలో అవుతూనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. పక్క రాష్ట్రాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఎలా నిర్వహిస్తున్నారనేదానిపై కూడా హైదరాబాద్ పోలీస్ శాఖ స్టడీ చేయనున్నట్లు సమాచారం. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.

ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు చెక్ పాయింట్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు హైదరాబాదు పోలీసులు. ఇక పెద్దగా ఉండే రహదారులపై ఎక్కువగా పోలీసులను మోహరించవచ్చనే ఆలోచనతో అలాంటి రహదారులను హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పాయింట్స్‌గా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా పీపీఈ కిట్లు పోలీసులు తప్పకుండా ధరించాల్సి ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో వినియోగించే ప్రధాన పరికరం బ్రీత్ అనలైజర్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. బ్రీత్ అనలైజర్‌తోనే మందుబాబులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా దీనిపై పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
Police in hyderabad are gearing up for a drunk and drive tests as the govt had given permissions to open pubs and bars in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X