హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊహించని జల ప్రళయం... 1908ని తలపించిన కల్లోల పరిస్థితులు... బిక్కుబిక్కుమంటూ జనం...

|
Google Oneindia TeluguNews

ఊహించని జల ప్రళయానికి హైదరాబాద్ విలవిల్లాడుతోంది. నీట మునిగిన ఇళ్లు... తెగిపోయిన రోడ్లు... చెరువులను తలపిస్తున్న కాలనీలు... జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన జనం... ఇలా నగరంలో ఎటు చూసినా జడివాన సృష్టించిన అలజడే కనిపిస్తోంది. సోమ,మంగళవారాల్లో కురిసిన వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమవగా... బుధవారం రాత్రి కురిసిన జోరు వాన జనాన్ని మళ్లీ బెంబేలెత్తించింది. కొన్నిచోట్ల జనం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలకు చాలాచోట్ల పంటలు నీట మునగడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో .. మూసాపేట పిల్లర్ పై అధికారుల స్పందన ఇదేప్రమాదంలో హైదరాబాద్ మెట్రో .. మూసాపేట పిల్లర్ పై అధికారుల స్పందన ఇదే

1908 తర్వాత మళ్లీ ఇప్పుడే...

1908 తర్వాత మళ్లీ ఇప్పుడే...

ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 404శాతం అధిక వర్షపాతం నమోదవగా... తెలంగాణ జిల్లాల్లో 54శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత 33 ఏళ్లలో ఇంత భారీ వర్షం ఇదే మొదటిసారి. అప్పుడెప్పుడో 1908లో మూసీ వరదలతో నగరం ఎదుర్కొన్న కల్లోల పరిస్థితులు ఇప్పుడు మళ్లీ కళ్లకు కడుతున్నాయి. హిమాయత్ సాగర్ 13 గేట్లను ఎత్తడంతో మూసీ నదిలో వరద ఉధృతి తీవ్రమైంది. దీంతో చాదర్‌ఘాట్,ముసారాంబాగ్,పురానా పూల్ ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. అంబర్ పేట,ప్రేమ్ నగర్,గోల్నాక,న్యూ దుర్గా నగర్ కాలనీల్లో మోకాలి లోతు నీళ్లు చేరాయి.

ఇప్పటివరకు 24 మంది మృతి

ఇప్పటివరకు 24 మంది మృతి

వాన బీభత్సానికి హైదరాబాద్ సహా తెలంగాణలో ఇప్పటివరకూ24 మంది మృతి చెందారు. పలుచోట్ల గల్లంతైనవారి లెక్కలు ఇంకా తేలలేదు. ఫలక్‌నుమాలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతైన దృశ్యాలు... పార్క్ చేసిన ఉన్న కార్లు నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు... హైదరాబాద్-బెంగళూరు రహదారి కోతకు గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్‌ మార్గాలు జలమయంగా మారాయి. నగరంలో మొత్తం 122 ప్రాంతాల్లో 20,540 ఇళ్లు నీట మునిగినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

ఆలయాల్లోకి నీరు...

ఆలయాల్లోకి నీరు...

బల్కంపేట ఎల్లమ్మ గుడిలోకి వర్షపు నీరు చేరింది. వరద నీరు అమ్మవారి పాదాలను తాకింది. దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం,పురానాపూల్ శివాలయాల్లోకి కూడా వరద నీరు చేరింది. మూసీ ఉప్పొంగడంతో ముసారాంబాగ్ బ్రిడ్జి ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. రామాంతార్ పూర్ సహా కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు డివైడర్లను సైతం ధ్వంసం చేశారు. వర్ష బీభత్సానికి దాదాపు 30 పాత భవనాలు,గోడల కూలిపోయాయి. అపార్టుమెంట్లలో సెల్లార్లలోకి నీళ్లు చేరడంతో చాలామంది మోటార్లతో ఆ నీటిని బయటకు తోడి పోశారు.

నిరంతర పర్యవేక్షణలో కేసీఆర్...

నిరంతర పర్యవేక్షణలో కేసీఆర్...


బుధవారం రాత్రి మళ్లీ వర్షం కురవడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలో అధికారులు,పోలీసులకు మార్గనిర్దేశం చేశారు. అటు మంత్రి కేటీఆర్ రాజధానిలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.

బలహీనపడ్డ వాయుగుండం

బలహీనపడ్డ వాయుగుండం

బుధవారం (అక్టోబర్ 14) అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 5.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం(అక్టోబర్ 15) కూడా రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికైతే వాయుగుండం బలహీనపడిందని... కర్ణాటక,మహారాష్ట్రల వైపు మళ్లిందని తెలిపింది. ఈ నెల 16న అరేబియా మహాసముద్రంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని... అయితే అది తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపించదని పేర్కొంది.

Recommended Video

#HyderabadFloods-Helpline Numbers:TS Gov Declared 2 Days Holidays | Oneindia Telugu

English summary
Telangana government declared holidays on Wednesday and Thursday as Hyderabad witnessed heavy rains on Tuesday with heavy water-logging and traffic jams in different areas even as several other parts of the state reported similar weather conditions, which were triggered following a deep depression over the west-central Bay of Bengal, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X