హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జంట నగరాల్లో దంచి కొడుతున్న వాన... అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం

|
Google Oneindia TeluguNews

జంటనగరాల్లో పలుచోట్ల వాన దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆసౌకర్యానికి గురయ్యారు. సుమారు రెండు గంటలుగా వాన కురుస్తుండడంతో విధులు ముగించుకుని ఇంటికి చేరుకునే నగరవాసులకు ఇబ్బందిగా మారింది. విపరీతమైన వర్షంతో ఎక్కడిక్కడ,ప్రయాణికులు వాహనదారులు రోడ్లపైనే నిలిచిపోయారు. ప్రధాన రోడ్లన్ని జలమయమయ్యాయి.

రెండుగంటలుగా కురుస్తున్న వాననీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక సాయంత్రం వేళ కావడంతో అటు హైటెక్ సిటి నుండి వచ్చే రోడ్డు మార్గం తీవ్ర ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఐటి కారిడార్ ప్రాంతాలతో పాటు నగర శివారు ప్రాంతాలు జలమయ్యాయి. భారీ వర్షంతో పౌరులు బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు పౌరులకు సూచించారు. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఆలస్యంగా బయలుదేరాలన్నారు. భారీ వర్షం సందర్భంగా 13 రెస్క్యూ టీమ్‌లను అప్రమత్తం చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

hyderabad roads are in water logged by heavy rains

మంగళవారం రాత్రి రికార్డ్ స్థాయిలో కురవడంతో రోడ్లన్ని జలయయిన విషయం తెలిసిందే.. అర్ధరాత్రి వరకు కురిసిన వర్షంతో రోడ్లన్ని పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. కాగా గత వందసంవత్సరాల్లో ఎన్నట్టు లేనట్టుగా రికార్డు స్థాయిలో వర్షం కురిసినట్టు వాతవరణశాఖ అధికారులు ప్రకటించారు. మరో రెండు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
English summary
The second day also hyderabad roads are in water logged by heavy rain in the evening. heavy rains in hyderabad twin cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X