హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40ఏళ్ల చెట్టు నరికివేత: రూ. 62వేల జరిమానా, 8వ తరగతి విద్యార్థి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటడం, పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు చెట్లు నరకుతుండటంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఓ చెట్టును నరికిన వ్యక్తికి భారీగా జరిమానా విధించడం గమనార్హం.

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డువస్తోందని స్థానికంగా ఉండే వ్యక్తులు ఓ భారీ వేపచెట్టును నరికేశారు. సుమారు 40 ఏళ్ల వయస్సు ఉండే వేప చెట్టును రాత్రి రాత్రి కొట్టేయడంతోపాటు ఆనవాళ్లు కనిపించకుండా కలపను తరలించారు. అంతేగాక, ఆ చెట్టు ఆనవాళ్లను కూడా లేకుండా చేసేందుకు తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు.

 hyderabad: Rs 62,075 fined for cutting of 40 year old neem tree.

కాగా, ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ()1800-425-5364)కు ఫోన్ చేశాడు. తాను గ్రీన్ బ్రిగేడియర్‌గా పరిచయం చేసుకున్న విద్యార్థి.. తమ ఇంటి సమీపంలో పెద్ద చెట్టును కొట్టేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

విచారణ చేపట్టిన అటవీ శాఖ ఈస్ట్ అధికారులు అనుమతి లేకుండా చెట్టు నరికివేతను నిర్ధారించారు. దీనికి బాధ్యులైనవారికి భారీ జరిమానా విధించారు.
వేపచెట్టు నరికివేసినవారికి రూ. 62,075 జరిమానా వేసి, వసూలు చేశారు. వీలైతే మొక్కలు నాటండి కానీ, ఇలా చెట్లను నరికివేయొద్దని స్థానికులకు అధికారులు సూచించారు. ఇక బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదు చేసిన ఆ బాలుడిని అటవీశాఖ అధికారులు అభినందించారు.

English summary
hyderabad: Rs 62,075 fined for cutting of 40 year old neem tree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X