హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్దది.. చిన్నదనేం లేదు: హైదరాబాద్ తొలి ఫీమేల్ ఫుడ్ డెలివరీ ఏజెంట్ జననీరావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలూ దూసుకుపోతున్నారు. ఏ రంగాన్ని చూసినా మహిళల ప్రాధాన్యత చెప్పుకోదగ్గ రీతిలోనే ఉంటోంది. మెట్రో నగరాల్లో సాధారణంగా ఫుడ్ డెలివరీ చేసే విధుల్లో ఎక్కువగా పురుషులే ఉంటారు. ఈ రంగంలో మహిళలు దాదాపు అసలే కనిపించరు. కానీ, హైదరాబాద్ నగరంలో ఈ రంగంలో దూసుకుపోతోంది జననీరావు.

తొలి మహిళా ఫుడ్ డెలివరీ ఏజెంట్..

తొలి మహిళా ఫుడ్ డెలివరీ ఏజెంట్..

హైదరాబాద్ తొలి మహిళా ఫుడ్ డెలవరీ ఏజెంట్‌గా ఆమె ఇప్పుడు రికార్డు సృష్టించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో జనని ఫీమేల్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తోంది. ఇతర ప్రాంతాల్లో అరుదుగా ఉన్నారు ఫీమెల్ డెలివరీ ఏజెంట్లు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో అయితే అసలే లేరు అని చెప్పవచ్చు. జననీరావు ఈ రంగాన్ని ఎంచుకుని తొలి మహిళగా.. ఇతర మహిళలు, యువతులకు ఆదర్శంగా నిలుస్తోంది.

చిన్నది పెద్దది అంటూ ఏమీలేదు..

చిన్నది పెద్దది అంటూ ఏమీలేదు..

అయితే, జననీరావు ఉన్నత చదువులు అభ్యసించడం గమనార్హం. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. విల్లామేరీ కాలేజీలో సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. పైచదువులకు కొంత సమయం ఉండటంతో ఆ సమయాన్ని ఇలా ఈ ఉద్యోగం చేస్తూ గడుపుతోంది. ఉద్యోగాల్లో చిన్నది పెద్దది అంటూ ఉండదని ఆమె చెప్పుకొచ్చారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రదేశాల్లో జననీరావు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు జననీరావు.

ఎంతో ఆసక్తిగా.. సరదాగా.

ఎంతో ఆసక్తిగా.. సరదాగా.

తాను రెండు నెలల నుంచి స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నానని జననీరావు వెల్లడించారు. ఈ ఉద్యోగం ఎంతో ఆసక్తిగా ఉందని, సరదాగా కూడా ఉందని చెప్పుకొచ్చారు. తాను ఈ ఉద్యోగం చేస్తూ అనేక మంది వినియోగదారులను కలవడం జరుగుతోందని, అది తనకు ఎన్నో విషయాలను నేర్పుతుందని అన్నారు. ఇదో భిన్నమైన అనుభూతులను కల్పిస్తోందని తన ఉద్యోగంపై మక్కువను చాటుకుంటున్నారు జననీరావు.

యువతులకు జననీరావు పిలుపు

యువతులకు జననీరావు పిలుపు

తాను ఈ ఉద్యోగం చేయడంపై పలువురు కస్టమర్లు తనను అభినందించారని తెలిపారు. ఈ రంగంలో మహిళలు రావడం మంచి పరిణామమేనని పలువురు చెప్పారని తెలిపారు.

సమాజంలో ఇప్పుడిప్పుడే మహిళల శక్తిసామర్థ్యాలపై అంచనాలు మారుతున్నాయని, ఏ రంగంలోనైనా మహిళలు రాణించగలరనే విషయం తెలిసివస్తోందని అన్నారు. హైదరాబాద్‌లో మహిళల రక్షణ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చాలా భద్రమైన నగరమని చెప్పుకొచ్చారు. తనలాగే మహిళలంతా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని బయటకి రావాలని పిలుపునిచ్చారు.

English summary
A girl Janani Rao, in her 20s scooting around the Hyderabad city delivering food, is breaking social barriers by taking the unconventional job of a delivery woman to earn her livelihood and inspire others to get into this field.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X