• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వీడెక్కడి మొగుడురా నాయనా.. సెక్స్ వీడియోలు భార్యకు చూపిస్తూ.. అలా చేయాలంటూ చివరకు..!

|

హైదరాబాద్ : భర్త శాడిస్టులా మారాడు. వివాహ బంధానికి అర్థం మారుస్తూ భార్యకు నరకం చూపిస్తున్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే తనలోని మానవ మృగాన్ని బయటకు రప్పించాడు. అనుక్షణం భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. సహనంతో నిరీక్షించిన సతీమణిని మరింత బాధించడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో పోర్న్ వీడియోలు చూపిస్తూ.. ఆ రకంగా తనతో ఉండాలంటూ ప్రతి నిత్యం టార్చర్ పెట్టాడు. చివరకు అతగాడి వేధింపులు భరించలేక ఠాణా మెట్లెక్కారు సదరు భార్య. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది.

బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. పోలీసుల ప్రయత్నం విఫలం.. పట్టిస్తే లక్ష పారితోషికం..!బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. పోలీసుల ప్రయత్నం విఫలం.. పట్టిస్తే లక్ష పారితోషికం..!

పెళ్లినాటి బాసలు మరిచి.. నిత్యం వేధింపులే..!

పెళ్లినాటి బాసలు మరిచి.. నిత్యం వేధింపులే..!

పెళ్లి నాటి ప్రమాణాలు మరిచిపోయాడు ఓ భర్త. జీవితాంతం తోడుంటానంటూ.. కష్టసుఖాల్లో అండగా ఉంటానంటూ బాసలు చేసి ఇప్పుడేమో భార్యను మధ్యలోనే వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఆ క్రమంలో వివాహమైన కొద్ది రోజుల నుంచే వేధింపుల పర్వం మొదలుపెట్టాడు. ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా నరకం చూపినా కూడా ఆమె సహనంతో భరించింది.

చివరకు ఆయన గారి పైత్యం మరింత ముదిరి లేనిపోని కోర్కెలు కోరడంతో ఇక ఓపిక పట్టడం ఆమె వల్ల కాలేదు. వివాహ బంధం మీద గౌరవంతో అతడు మారతాడని చూసినా ఆయన తీరు ఏమాత్రం మారకపోగా ఇంకా పైశాచికత్వం ఎక్కువ కావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు.

 పెళ్లైన కొద్ది రోజులకే వేధింపులు.. డబ్బులు సైతం లాక్కుంటూ..!

పెళ్లైన కొద్ది రోజులకే వేధింపులు.. డబ్బులు సైతం లాక్కుంటూ..!

హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళకు నగరంలోనే నివసించే 35 ఏళ్ల రఘుతో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే తనలోని శాడిస్టును బయటపెట్టాడు రఘు. భార్యను ఏమాత్రం గౌరవించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. పైగా ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె జీతం తీసుకునేవాడు. భార్యకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులు తన దగ్గరే ఉంచుకునేవాడు.

అలా ఆమె దగ్గర నయా పైసా లేకుండా చేయడమే అతడి ఉద్దేశం. అంతేకాదు పెళ్లికి ముందు ఆమె దాచుకున్న డబ్బులను సైతం తీసుకున్నాడు. ఆ క్రమంలో ఆమె పేరెంట్స్‌కు ఎలాంటి సపోర్ట్ చేయొద్దని హుకుం జారీ చేశాడు.ఇన్ని రకాలుగా బాధపెట్టినా కూడా ఆమె సహనంతో వివాహ బంధాన్ని నెట్టుకొచ్చారు.

 పోర్న్ వీడియోలు చూపిస్తూ.. అలా కావాలంటూ వేధింపులు

పోర్న్ వీడియోలు చూపిస్తూ.. అలా కావాలంటూ వేధింపులు

ఎన్నిరకాలుగా బాధ పెట్టినా ఆమె ఓపిక పట్టడం భరించలేకపోయాడు. ఆ క్రమంలో కొత్త రకం స్కెచ్ వేశాడు. ఇటీవల కొద్దిరోజులుగా స్మార్ట్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపిస్తూ నాతో అలా ఉండాలంటూ వేధిస్తున్నాడు. పోర్న్ చిత్రాల్లో చేసినట్లు తనతో చేయాలంటూ బలవంతపెడుతున్నాడు. నిత్యం అదే తంతుగా మారడం.. శరీరకంగా, మానసికంగా హింసిస్తుండటంతో చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

తన భర్త అశ్లీల వీడియోలు చూపిస్తూ అలా కావాలంటూ వేధిస్తుండటంతో ఆమె నిరాకరిస్తూ వచ్చారు. దాంతో తనకు డైవోర్స్ ఇవ్వాలంటూ కొత్త మెలిక పెట్టాడు. భర్త చెప్పినట్లు భార్య నడుచుకోవాలని.. లేదంటే నీవు అవసరం లేదంటూ బెదిరించాడు. అంతేకాదు పర పురుషుల దగ్గరకు వెళ్లమని చెబితే కూడా వెళ్లాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఆ క్రమంలో ఈ నెల 26వ తేదీన ఆమెతో గొడవపడి కొట్టి ఇంటినుంచి వెళ్లిపోయాడు. మూడు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో చివరకు చేసేదేమీ లేక బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రఘుపై 498(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Husband turned as sadist. The wife is hell-bent on interpreting the marriage bond. A few days after his wedding, he brought out the human beast. Wife has been charged with harassment. She waited patiently, but he started to hurt more. He showing Porn videos and asked to do like that. Finally, the wife was unable to cope with her abusive husband and given police complaint. The event in Hyderabad has been the subject of debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X