హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెకీ శ్వేత ఆడియో టేపులు.. అజయ్ తల్లి, సోదరితో కాల్.. అయినా తీయకపోవడంతోనే...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌కి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రియుడు అజయ్ వేధింపులతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. శ్వేత కుటుంబసభ్యులు ఆరోపణలతో అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అజయ్ వల్లే శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా శ్వేత మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అందులో ఆమె చనిపోయేముందు మాట్లాడిన కాల్ కావడంతో ఎవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారు అనే ఉత్కంఠ నెలకొంది.

హత్య చేసి ఆత్మహత్యగా..?

హత్య చేసి ఆత్మహత్యగా..?

అయితే శ్వేతను అజయ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె పేరంట్స్ అంటున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ ఆడియో టేపులు బయటకు రావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో శ్వేత ఇద్దరితో మాట్లాడారు. అజయ్ తల్లి, సోదరితో మాట్లాడారని పోలీసులు తెలిపారు. అందులో తన ఫోటోలను సోషల్ మీడియోలో అప్ లోడ్ చేశారని.. వాటిని తీయడం లేదని శ్వేత వాపోయారు. ఇదే విషయం వారిద్దరితో శ్వేత తన గోడును వెల్లబోసుకుంది.

ఫోటోలు షేర్ చేయడంతో..

ఫోటోలు షేర్ చేయడంతో..

అయినా వారు వినిపించుకోలేదు. అజయ్‌కి చెప్పారో లేదో తెలియదు గానీ.. ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు అలానే ఉన్నాయి. దీంతో శ్వేత తీవ్ర మనో వేదనకు గురయ్యారు. పేరంట్స్‌కి చెప్పుకోలేక.. తనలో తాను కుమలిపోయారు. ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో చివరకు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆమె సూసైడ్‌‌పై మొదట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత వారి అనుమానాలే నిజమవుతోన్నాయి. ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. అజయ్ వేధింపుల వల్లే చనిపోయినట్టు తెలుస్తోంది.

ప్రేమ పేరుతో మోసం..

ప్రేమ పేరుతో మోసం..

ప్రేమించినట్టు నటించి అజయ్ మోసం చేశాడని శ్వేత పేరంట్స్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వంచించారని పేర్కొన్నారు. శ్వేత పిరికిది కాదు అని.. అని బ్లాక్ మెయిల్ చేయడంతో బలవన్మరణానికి పాల్పడిందని వెల్లడించారు. ఫోటోలు షేర్ చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యిందని వారు చెబుతున్నారు. శ్వేత పేరంట్స్ చెబుతోన్న అంశాలు.. ఆడియో టేపుల సంభాషణల ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అజయ్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు.

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు..

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు..


అజయ్ వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని శ్వేత పేరంట్స్ చెబుతున్నారు. వారు స్పందించకపోవడంతో దారుణం జరిగిందని తెలిపారు. కానీ శ్వేత పేరంట్స్ ఆరోపణలపై సంబంధిత పోలీసులు స్పందించలేదు.

English summary
swetha audio tapes: hyderabad software engineer swetha audio tapes leaked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X