హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కబ్జారాయుళ్లకు ఫుల్ సపోర్ట్.. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లు సప్లై.. చివరకు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జాగా కనిపిస్తే చాలు పాగా వేసే ఘరానా మోసగాళ్లున్న కలికాలం ఇది. పల్లెల నుంచి పట్నం దాకా కబ్జా రాయుళ్లు బరితెగిస్తున్నారు. ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో వారి అరాచకాలకు అడ్డు లేకుండా పోతోంది. అదలావుంటే భూకబ్జాదారులకు అండగా ఉంటూ నకిలీ డాక్యుమెంట్లు స‌ృష్టించడమే గాకుండా పాత తేదీలతో స్టాంప్ పేపర్లు అందిస్తున్న ముగ్గురు ఘరానా మోసగాళ్ల గుట్టురట్టైంది.

ఆదాయం సరిపోని ముగ్గురు వ్యక్తులు ఒక్కటయ్యారు. కబ్జా రాయుళ్లకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో నకిలీ ల్యాండ్‌ డాక్యుమెంట్లు, పాత స్టాంప్‌ పేపర్లు అమ్ముతూ పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విధంగా భూకబ్జాదారులకు అవసరమైన అన్ని విషయాల్లో సాయం అందిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. చివరకు పోలీసులకు చిక్కడంతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు.

ఈజీ మనీ కోసం.. ఇదో దందా

ఈజీ మనీ కోసం.. ఇదో దందా

హైదరాబాద్ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన క్రాంతి సురేశ్ కుమార్, న్యూ బోయిగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీ.. సికింద్రాబాద్ కోర్టు దగ్గర నాన్ - జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆ క్రమంలో ఇద్దరూ స్నేహితులుగా మారారు. అయితే స్టాంప్ వెండర్లుగా సరైన ఆదాయం పొందలేకపోతున్నామని భావించారు. దాంతో ఎలాగోలా ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఆ విధంగా అడ్డదారులు వెతుక్కుని అడ్డంగా బుక్కయ్యారు.

కబ్జారాయుళ్లకు అండగా నిలిస్తే డబ్బులు బాగా సంపాదించొచ్చని వ్యూహ రచన చేశారు ఆ ఇద్దరు. ఆ మేరకు నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించే పనిలో పడ్డారు. అంతేకాదు వాటికి అనుగుణంగా పాత తేదీలతో ఉన్నటువంటి నాన్ - జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు కూడా సేకరించేవారు.

మోడీ, అమిత్‌షా యాక్షన్ మూడ్.. ఇక అరాచక శక్తులకు బ్రేక్.. కశ్మీర్ ఇష్యూపై రాజాసింగ్ (వీడియో)మోడీ, అమిత్‌షా యాక్షన్ మూడ్.. ఇక అరాచక శక్తులకు బ్రేక్.. కశ్మీర్ ఇష్యూపై రాజాసింగ్ (వీడియో)

కబ్జాదారులకు అన్నీ తామై..

కబ్జాదారులకు అన్నీ తామై..

తేలిగ్గా డబ్బు సంపాదించాలనే వారి దురాశ చివరకు కొంప ముంచింది. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ అడ్డదారులు తొక్కిన క్రాంతి సురేశ్ కుమార్‌, మహ్మద్ అలీ చివరకు పోలీసులకు చిక్కారు. అయితే వీరికి తోడు మరొకరు జత కలిశారు. ఓల్డ్ సిటీకి చెందిన సతీశ్ నుంచి పాత తేదీలతో కూడిన స్టాంప్ పేపర్లు క్రాంతి సురేశ్ కుమార్ సేకరించేవాడు. వాటిని మహ్మద్ అలీ ద్వారా అవసరమున్న కబ్జాదారులకు విక్రయించేవాడు. అలా పెద్దమొత్తంలో డిమాండ్ చేసేవారు.

కబ్జాదారులకు అన్నీ తామై అండగా నిలిచేవారు వీరిద్దరు. నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు సిద్దం చేసి ఇవ్వడమే గాకుండా వాటికి అనుగుణంగా పాత తేదీలతో కూడిన నాన్ - జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు కూడా వీరే ప్రొవైడ్ చేసేవారు. అయితే ఈ ముగ్గురి ముఠాను గుట్టురట్టు చేశారు తూర్పు మండల
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

వీరు తయారుచేసిన డాక్యుమెంట్లతో కబ్జాలు..!

వీరు తయారుచేసిన డాక్యుమెంట్లతో కబ్జాలు..!

ఒకరు కాదు ఇద్దరు కాదు వీరు చాలామందికి నకిలీ డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసి ఇవ్వడం.. పాత తేదీలతో కూడిన స్టాంప్ పేపర్లు అమ్మడం జరిగింది. దాంతో రియల్టర్లు కొందరు రెచ్చిపోయారనే ఆరోపణలున్నాయి. వీరు తయారుచేసి ఇచ్చిన నకిలీ డాక్యుమెంట్లతో కొందరు వివాదస్పద స్థలాలను కబ్జా చేసినట్లు వెలుగుచూసింది. అంతేకాదు వీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్లతో దళారులు అమాయక ప్రజల్ని మోసం చేసిన ఘటనలు బయటపడ్డాయి.

వీరి లీలలపై పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు స్వామి వలపన్ని క్రాంతి సురేశ్ కుమార్, మహ్మద్ అలీలను ఆదివారం నాడు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి 228 ఖాళీగా ఉన్న పాత స్టాంప్‌ పేపర్లు, 105 ఖాళీ కొత్త నాన్‌ - జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు, 104 నకిలీ రబ్బర్‌ స్టాంపులు తదితరాల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సతీష్‌ కోసం గాలిస్తున్నారు.

English summary
In Hyderabad, three land grabbing scammers have been supplying stamp papers with old dates as well as creating fake documents while supporting landlords. Three people with no income were together. To that end, they are making huge profits by selling fake land documents and old stamp papers. Ultimately, they caught to police and counting on the prison wreckage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X