• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వామ్మో కిడ్నాప్.. పోలీసుల ఉరుకులు పరుగులు.. రాక్షసుడు సినిమా చూసి చివరకు..!

|

హైదరాబాద్ : నగరంలో విద్యార్థిని కిడ్నాప్ కేసు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అటు తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు అది నకిలీ కిడ్నాప్ కథ అని తేలడంతో పేరెంట్స్‌తో పాటు పోలీసులు అవాక్కయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన సదరు విద్యార్థిని హైదరాబాద్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ క్రమంలో ఆమె కిడ్నాప్‌కు గురైందనే సమాచారంతో పోలీసులు పరుగులు పెట్టారు. ఒక్క రోజు వ్యవధిలోనే కిడ్నాప్ కథ చేధించారు. రాక్షసుడు సినిమా స్ఫూర్తితో కిడ్నాప్ డ్రామా జరిగిందని గుర్తించిన పోలీసులు విస్తుపోవాల్సిన పరిస్థితి.

కిడ్నాప్ కథ.. ఉరుకులు పరుగులు.. చివరకు..!

కిడ్నాప్ కథ.. ఉరుకులు పరుగులు.. చివరకు..!

గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చదువులో ప్రతిభ కనబరిచే సదరు విద్యార్థినిని డిగ్రీ కోసం మంచి కాలేజీలో చేర్పించాలనేది తల్లిదండ్రుల ఆలోచన. ఆ మేరకు సోమాజిగూడ ప్రాంతంలోని ఓ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో చేర్పించారు. అయితే ఆ కళాశాల వాతావరణం ఆమెకు కొత్తగా కనిపించింది. అక్కడ విద్యార్థినులు ఇంగ్లీష్, హిందీ తప్ప మరో భాష మాట్లాడలేని పరిస్థితి. దాంతో చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్ రాకపోవడం, హిందీ భాషపై పట్టులేకపోవడం.. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లో అవగాహన లేకపోవడం.. అలా ఆమె పడరాని పాట్లు పడింది. దాంతో కాలేజీ ప్రారంభమైన రెండు మూడు నెలల్లోనే తీవ్ర వత్తిడికి గురైంది. కొద్దికాలంగా మానసికంగా ఆందోళన చెందుతోంది. అయితే తాను ఆ విషయం ఇంట్లో చెబితే నమ్మబోరని కిడ్నాప్ కథకు తెరతీసింది.

ఆరోగ్య శ్రీ సేవలు శుక్రవారం నుంచి బంద్..!

 కిడ్నాప్ కేసుతో కలకలం

కిడ్నాప్ కేసుతో కలకలం

ఇటీవల హైదరాబాద్‌లో డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ జరిగిందనే వార్త సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు అంబులెన్స్‌లో వచ్చి కిడ్నాప్‌ చేశారనే సమాచారంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. చివరకు టెక్నాలజీతో పాటు సీసీటీవి ఫుటేజ్ సాయంతో 18 గంటల్లోనే కేసును ఛేదించారు. అయితే అది కిడ్నాప్‌ కాదని.. సదరు విద్యార్థిని డ్రామా ఆడిందని తేల్చారు.

చదువు.. వత్తిడి.. కిడ్నాప్ డ్రామా..

చదువు.. వత్తిడి.. కిడ్నాప్ డ్రామా..

ఇంటర్ వరకు బాగానే చదివినప్పటికీ.. డిగ్రీ కాలేజీలో కొత్త వాతావరణం కారణంగా ఇబ్బంది పడినట్లు పోలీసులకు చెప్పింది ఆ విద్యార్థిని. ఇటీవల విడుదలైన రాక్షసుడు సినిమా చూసి కట్టు కథ అల్లినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకుంది. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకుని గుంటూరుకు చేరుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కాసింత భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఆమె మాటలు నమ్మాలో లేదో వారికి అర్థం కాలేదు.

ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వారికి తెలిసిన బంధువు ఒకరు పోలీస్ అధికారి కావడంతో ఆయన్ని ఆశ్రయించారు. ఆమె చెప్పిన విషయం పూసగుచ్చినట్లు వివరించారు. దాంతో వారిని వెంటపెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చారు. పంజాగుట్ట పోలీసులను కలిసి జరిగిందంతా చెప్పారు. అయితే కిడ్నాప్ కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడింది.

రాజకీయ బద్ధ శత్రువులు.. గురువు, మాజీ శిష్యుడు.. ఒకే స్టేజీ మీద దర్శనం, టెన్షన్ సీన్..!

రాక్షసుడు సినిమా చూసి.. ఇలా డ్రామా

రాక్షసుడు సినిమా చూసి.. ఇలా డ్రామా

ఈ కిడ్నాప్ డ్రామా కేసులో సదరు విద్యార్థిని పోలీసుల ఎదుట నోరు విప్పింది. డిగ్రీ కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి తనకు అదోలా ఉందని.. చదువు మీద ధ్యాస లేకుండా పోయిందని.. అదే క్రమంలో ఈ డ్రామా ఆడినట్లు వివరించింది. డిగ్రీ చదువుకోకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వెల్లడించింది.

ఇటీవల రాక్షసుడు సినిమా చూసిన నేపథ్యంలో దాని స్ఫూర్తిగా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు ఒప్పుకుంది. ఆ సినిమాలో వచ్చిన కిడ్నాప్ డ్రామా ఆధారంగానే తాను ఈ నాటకానికి తెర తీసినట్లు పేర్కొంది. మొత్తానికి విద్యార్థిని కిడ్నాప్ జరిగిందన్న అలజడితో ఉలిక్కిపడ్డ పోలీసులు.. చివరకు అదంతా ట్రాష్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. అటు తల్లిదండ్రులు కూడా హమ్మయ్య అనుకున్నారు. విద్యార్థిని చేసిన పనికి చింతించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A student kidnapping case in the city sparked a police crackdown. That threatened the parents. In the end, it became a fake kidnapping story. Girl student from Guntur district is studying for a degree first year in Hyderabad. According to the police, she was run over with information that she had been kidnapped. Within one day, the kidnapping story broke. The police have discovered that the kidnapping drama was inspired by the "Rakshasudu" telugu movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more