హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ శబ్ధంతో పేలుడు: ఒకరు మృతి, తెగిపడిన చేతులు, గణేష్ నిమజ్జనమే టార్గెటా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ అనుమానాస్పద కవర్‌ను ఓ వ్యక్తి తెరవడంతో ఒక్కసారిగా భారీగా శబ్ధంతో పేలిపోయింది. పేలుడు ధాటికి కవర్ తెరిచిన వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Hyderabad: Suspicious blast occurred at footpath in Rajendranagar PS limits

ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్తలికి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కాగా, పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తిని చెత్తను సేకరించే అలీగా గుర్తించారు.

Hyderabad: Suspicious blast occurred at footpath in Rajendranagar PS limits

కాగా, శనివారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపు జరిగిన సమయంలో ఈ పేలుడు సంభవించివుంటే భారీగా నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. అయితే, ఈ బాంబు పేలుడు ప్రణాళికను గణేష్ నిమజ్జనాన్ని లక్ష్యంగా చేసుకునే చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Suspicious blast occurred at a footpath in Rajendranagar police station limits on Sunday. According to police, the blast incident happened when a 40- year-old person tried to open a plastic cover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X