• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారు

|

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి అతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని కూడా చీల్చిచెండాడారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతోపాటు హైదరాబాద్ మహానగర భవితవ్యంపైనా కేంద్ర మంత్రి కీలక కామెంట్లు చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలతో తన పర్యటన ప్రారంభించిన షా.. సికింద్రాబాద్ లో రోడ్ షో అనంతరం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020

కేసీఆర్ చల్లగా ఉండాలి..

కేసీఆర్ చల్లగా ఉండాలి..

‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. బక్కపలుచగా ఉండే తనను ఢీకొట్టడానికే బీజేపీ బడా నేతల్ని దింపుతోందని అంటున్నారు. సీఎం ఫోన్లకు కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. వీటిలో ఒక్కదానికైనా ఆధారం ఉందా? ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? బక్కగా ఉన్న కేసీఆర్ ను చంపాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చింది? ఎవరినైనా మేం ఎందుకు చంపుతాం? సీఎంను చంపడానికి మేం ఇక్కడికి రాలేదు. కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఆకాంక్షిస్తున్నాను. తన ఆరోపణలపై నిజంగా తన దగ్గర ఆధారాలుంటే, వాటికి కేంద్రానికి అందజేస్తే, తప్పకుండా పరిశీలిస్తాం. అంతేగానీ, రాజకీయ లబ్ది కోసం అనాలోచిత ఆరోపణలు తగవు. అసలు..

గల్లీ కూడా బీజేపీకి ఢిల్లీనే..

గల్లీ కూడా బీజేపీకి ఢిల్లీనే..

స్థానిక సంస్థలైన గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు రావడమేంటని తెలంగాణలోని ఇతర పార్టీలు వాపోతున్నాయి. వాళ్లకు నేనిచ్చే సమాధానం ఒకటే.. బీజేపీకి సంబంధించినంత వరకు గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా ఒకే స్థాయిలో పనిచేసి, ప్రజల మద్దతు కోరతాం. గల్లి ఎన్నికలంటే అంత అసులా? మీరు(కేసీఆర్) హైదరాబాద్ గల్లీలను శుభ్రం చేయలేకపోయారు కాబట్టే మార్పు కోసం మేం ఓటర్లను అభ్యర్థిస్తున్నాం. అయినా, ఎంతసేపూ ఫామ్ హౌజ్ లో పడుకునేవాళ్లకు గల్లీ సమస్యలు ఎలా తెలుస్తాయి? ఇటీవల..

అందుకే హైదరాబాద్ మునిగింది..

అందుకే హైదరాబాద్ మునిగింది..

ఇటీవల సిటీని భారీ వరదలు ముంచెత్తిన సమయంలో సీఎం కేసీఆర్ ఎక్కడున్నాడు? ఫాంహౌస్ లో కాదా? ప్రజలు వరదల్లో సతమతమైతే కేసీఆర్, ఓవైసీ బయట అడుగు పెట్టలేదు. ప్రజలను పరామర్శించలేదు. కేసీఆర్ ఇంటిపక్కన కూడా వరద నీళ్లు నిండిపోలేదా? అసలు ఫామ్ హౌజ్ నుంచి సెక్రటేరియట్ కు వస్తేనే కదా, ప్రజల సమస్యలేంటో తెలిసేది? ఎంఐఎం అండతో హైదరాబాద్ లో భారీ ఎత్తున అక్రమ కట్టడాలు పెరిగిపోయాయినందుకే నగరాన్ని వదరలు ముంచెత్తాయి. ఎంఐఎం అడుగుజాడల్లో నడుస్తోన్న టీఆర్ఎస్ ఆ అక్రమ కట్టడాలను విస్మరించడం వల్లే సిటీకి ముప్పు వాటిల్లింది. అసలు..

మధ్యలోనే ముగిసిన అమిత్ షా రోడ్ షో -ఉసూరుమన్న అభిమానులు -ఆ తప్పు జరగొద్దనే..

ఓవైసీతో కేసీఆర్ పొత్తులో తప్పులేదు

ఓవైసీతో కేసీఆర్ పొత్తులో తప్పులేదు

మజ్లీస్ తో అంటకాగుతోన్న కేసీఆర్.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంతే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ చీకటి పొత్తులు కొనసాగించడం ఎందుకు? ఎంఐఎంతో పొత్తు ఉందని కేసీఆర్ బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదు? హైదరాబాద్ నగరంలో రోహింగ్యాలపై ఓవైసీ పార్లమెంటులో ఏం మాట్లాడారో అందరం చూశాం కదా. ఎవరు పాకిస్థాన్ తో కలవాలని చూశారో ఓవైసీనే చెప్పాలి. హైదరాబాద్ అంటే మినీ భారత్. తెలంగాణ అంటే ఏ ఒక్క కుటుంబానిదో కాదు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ అడుగడుగునా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అందుకే..

హైదరాబాద్ ఫిలాసఫీ మారాలి..

హైదరాబాద్ ఫిలాసఫీ మారాలి..

టీఆర్ఎస్, ఎంఐఎంలను తరిమికొట్టడంతోపాటే హైదరాబాద్ ఫిలాసఫీ పూర్తిగా మారాలి. ఈ నగరం.. నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ గా మారాలి. కుటుంబ పాలన నుంచి నిజమైన ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం. అవినీతిని పారదోలి, పారదర్శక పాలన తీసుకొద్దాం. సంతుష్టికరణ నుండి సమిష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తాం. సిటీలో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తాం. హైదరాబాద్ లో సుపరిపాలన తీసుకొస్తాం. మేం ఏది చెప్తామో అది చేసి తీరుతాం.ఎంఐఎం, టీఆర్ఎస్ అవినీతి పాలన హైదరాబాద్ అభివృద్ధికి ప్రతిబందకంగా మారాయి. అవినీతిని అరికట్టడంతోనే నయా హైదరాబాద్ నిర్మిద్దాం. ఇవాళ్టి రోడ్ షోకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి మేయర్ ఖాయమన్న విశ్వాసం కలుగుతోంది. నిజానికి..

మోదీ వల్లే హైదరాబాద్‌కు ఈ స్థాయి..

మోదీ వల్లే హైదరాబాద్‌కు ఈ స్థాయి..

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కొనసాగుతోన్నా, భారత్ కు మాత్రమే విదేశీ పెట్టుబడులు దండిగా వస్తున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల ఎక్కువ లాభం పొందేది హైదరాబాదే. మోదీ విధానాల వల్లే హైదరాబాద్ కు ఈ స్థాయిలో విదేశీ సంస్థలు వచ్చాయి. ప్రధాని తీసుకొచ్చిన ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్' విధానం వల్ల హైదరాబాద్ యువతకే ఎక్కువ మేలు జరిగింది. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా చిరు వ్యాపారులకు కేంద్రం ఇచ్చిన లోన్లు లభించిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారు. రాష్ట్రానికి ఇప్పటికే 1.30లక్షల ఇళ్లిచ్చాం. తెలంగాణలో, హైదరాబాద్ లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేసీఆర్ అమలు చేయకపోవడం వల్లే పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జనం ఈసారి హైదరాబాద్ మేయర్ గా బీజేపీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు. అంతేకాదు,

  #AmitShahInGHMC : Amit Shah's Roadshow Attracts Massive Crowd వ్యూహాత్మకంగా రూట్ మ్యాప్ | GHMC polls
  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పైనా

  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పైనా

  హైదరాబాద్ లో జనాన్ని పట్టించుకోని కేసీఆర్.. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ పెడతానని బీరాలు పోతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇలాంటి మాటలే చెప్పిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ఫ్రంట్ పేరెత్తారు. అయినా, బీజేపీ వ్యతిరేక పార్టీలతో కాంక్లేవ్ కొత్తేముంది? గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ తరహా ప్రయత్నం చేశారు. ఎవరు ఏరకంగా వ్యూహాలు పన్నినా, బీజేపీ విధానాలకు వ్యతిరేకిస్తోన్న పార్టీలన్నింటినీ ప్రజలు తిరస్కరిస్తోన్న వైనం అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం'' అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

  English summary
  union home minister amit shah made sensational remarks on telangana chief minister kcr and aimim chief asaduddin owaisi in hyderabad on sunday. during his ghmc poll campaign, shah spoke to media and expressed confidence on bjp win
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X