హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగం పేరుతో మోసం: ఒమన్‌లో వృద్ధుడితో మహిళ పెళ్లి: చిత్రహింసలు, కాపాడాలంటూ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఒమన్‌లో చిక్కుకున్న తన కుమార్తెను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని హైదరాబాదుకు చెందిన ఒక మహిళ వేడుకుంటోంది. అక్కడ తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక అసలు విషయానికొస్తే... హైదరాబాదులోని గోల్కొండ ఖిల్లాకు చెందిన కౌసర్ బాను అనే యువతి బ్యూటీషియన్ ఉద్యోగం కోసం ఒమన్‌కు వెళ్లింది. ఒక ఏజెంట్ ద్వారా ఆమె ఒమన్‌కు వెళ్లింది. అయితే ఒమన్‌లో అడుగుపెట్టగానే అక్కడ ఎలాంటి ఉద్యోగం లేదనే విషయాన్ని తెలుసుకుని షాక్‌కు గురైంది. ఆ తర్వాత బలవంతంపై దివ్యాంగుడైన ఓ వృద్ధుడితో వివాహం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రతి రోజు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Hyderabad woman cheated in Oman:Mother cries for help urges centre to save her daughter

ఫాతిమా అనే ఏజెంట్ ద్వారా ఒమన్‌కు చేరుకుందని ఆమెనే తమ కుమార్తె కౌసర్‌ బానును మోసం చేసిందని కన్నీరుమున్నీరవుతోంది ఆ తల్లి. కౌసర్ బాను హైదరాబాదులో బ్యూటీ పార్లర్ నిర్వహించేదని లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని తల్లి చెప్పింది. అయితే ఒమన్‌లో ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు పడుతున్నది కౌసర్ భాను ఓ వీడియోను పోస్టు చేయడంతో ఆమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఉద్యోగం పేరుతో ఏజెంట్ ద్వారా ఒమన్‌కు వచ్చినట్లు వీడియోలో చెప్పిన కౌసర్ బాను.... ఉద్యోగం చూపించకుండా ఓ దివ్యాంగుడైన వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేశారని పేర్కొంది. తనను తిరిగి భారత్‌కు పంపాలని బతిమిలాడితే... తనను రూ.3లక్షలు చెల్లించమంటున్నారని కౌసర్ భాను ఆవేదన వ్యక్తం చేసింది.

తన సోదరి కౌసర్ భానును ఒమన్ దాటించి హైదరాబాదుకు క్షేమంగా చేర్చాలని విదేశాంగశాఖ మంత్రిని కోరింది సయేదా రఫీఖా. ఇదిలా ఉంటే మస్కట్‌లోని భారత ఎంబసీ కార్యాలయం ఆమెను సంప్రదించినట్లు తెలిపింది. క్షేమంగా చేరుస్తామని ట్వీట్ చేసింది. మరోవైపు ఏజెంట్ ఫాతిమాను కూడా సంప్రదించినట్లు ట్వీట్‌లో పేర్కొంది. ఆమెను భారత్‌కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

English summary
A woman in Hyderabad urges government to help in bringing her daughter back who married a man in Oman, UAE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X