హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్ గేర్ : యువతి వేధిస్తోందని యువకుడు సూసైడ్ అటెంప్ట్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : యువతులను వేధించే కేసులు కొకొల్లలు. ఇటీవల అవి ఇంకా ఎక్కువైపోయాయి. మైనర్ బాలికలను సైతం వేధించే మానవ మృగాలకు అంతే లేకుండా పోతోంది. ఆ క్రమంలో హైదరాబాద్‌లో రివర్స్ సీన్ కనిపించింది. యువతి కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగుచూసింది.

గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్‌కు చెందిన నందరాజు అలియాస్ నితిన్ అనే 26 సంవత్సరాల యువకుడు కారు డ్రైవర్‌గా జీవనోపాధి పొందుతున్నాడు. అయితే అతడి ఇంటి సమీపంలో ఉండే ఓ యువతి పోలీస్ కేసులతో సతాయిస్తోందనే కారణంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఒకసారి తనను వేధించాడని కేసు పెట్టన సదరు యువతి మరసారి తన సోదరుడిని కొట్టాడని ఇంకో కేసు పెట్టింది. తరచుగా ఆ యువతి కుటుంబ సభ్యులు తమతోనే కాకుండా కాలనీవాసులతోనూ గొడవ పెట్టుకుంటారనే ఆరోపణలున్నాయి. తరచుగా పోలీస్ కేసులు పెడుతూ మిగతా కుటుంబాలను ఇబ్బంది పెడతారనే వాదనలున్నాయి.

hyderabad youngster suicide attempt for girl harassment

బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. నాలుగు రోజులాయే జాడలేక.. నిందితుడు మోస్ట్ వాంటెడ్..!బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. నాలుగు రోజులాయే జాడలేక.. నిందితుడు మోస్ట్ వాంటెడ్..!

ఆ క్రమంలో మంగళవారం నాడు కూడా కాలనీలో ఆ యువతి కుటుంబ సభ్యులు రచ్చ రచ్చ చేశారు. పొరుగున ఉండే వారిని వీడియో తీస్తుండటంతో గొడవకు దారి తీసింది. అయితే నితిన్‌కు సంబంధం లేకున్నా కూడా అతడిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా మాటిమాటికీ ఘర్షణ పడుతూ కక్షసాధింపు ధోరణికి పాల్పడుతున్నారనే ఉద్దేశంతో నితిన్ మనస్థాపానికి గురయ్యాడు.

సదరు యువతి కుటుంబ సభ్యుల తీరుతో బేజారైన నితిన్ మానసికంగా కుంగిపోయాడు. ఆ క్రమంలో బుధవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేశారు. 70 శాతం ఒళ్లు కాలి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Hyderabad Youngster who stayed in rezimental bazar commits suicide, because of one girl and her family harassment. He got depressed and suicide attempt, seriously injured and shifted to Gandhi Hospital for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X