హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

60వ వసంతంలోకి అడుగిడిన హైదరాబాద్ జూ, విశేషాలు ఇవే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో గల నెహ్రూ జులాజికల్ పార్క్‌లో పలు రకాల జంతువులు ఉన్నాయి. వాటిని చూసి చిన్నారులు తెగ ఆనంద పడిపోతుంటారు. పెద్దలకు కూడా తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అయితే ఆ జూ 60వ ఏట అడుగిడింది. గురువారం వార్షికోత్సవం జరిగింది. చక్కగా పనిచేసిన వారికి అవార్డులను కూడా అందజేశారు.

జూ యానివర్సరీ..

జూ యానివర్సరీ..

యానివర్సరీ సందర్భంగా జత మీర్కట్స్, తెల్లని ఆర్మొసెట్ పిల్లుల ఎన్ క్లోజర్‌లోకి వదిలారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ఆర్ఎం దోబ్రియాల్, అడిషనల్ అండ్ చీఫ్ కన్జ్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ జూ పార్క్ వినయ్ కుమార్, క్యురేటర్ ఎస్ రాజశేఖర్ పాల్గొన్నారు.

 ఇవీ అక్కడ కనిపిస్తాయి

ఇవీ అక్కడ కనిపిస్తాయి


సౌతాఫ్రికాలో కనిపించే చిన్న ముంగూస్‌నే మీర్కాట్స్ అంటారు. మార్మోసెట్స్ అనే కోతుల జాతి దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. అలాగే వివిధ రకాలతో ఫిష్ పాండ్ ఏర్పాటు చేశారు. జూలో 59వ వీక్లీ వేడుకలు జరిగాయి. దోడ్రియాల్ అనే ఆసియాకు చెందిన సింహం పిల్ల అదితి అని పేరు పెట్టారు. ఈ ఏడాది సైనా దానికి జన్మనిచ్చింది.

జూ డే

జూ డే


ఏటా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వన్యప్రాణి సప్తాహ్ జరుపుకుంటారు. దానినే జూ డేగా అనుకుంటారు. ఆసియాలోనే హైదరాబాద్ జూ ఉత్త జంతు ప్రదర్శనశాలలో పేరు గాంచింది. కరోనా తర్వాత ఇక్కడికి సందర్శకుల సంఖ్య పెరిగింది. వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఇక్కడి సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

 అవార్డులు

అవార్డులు


జూలో అత్యుత్తమ సేవలు చేసిన కేవీఎస్ బాబుకు అవార్డు, తోటమాలి రాంచందర్, మాలి, జంతు సంరక్షకుడు జిలానీ ఖాన్, ట్రాఫిక్ కంట్రోలర్ సయ్యద్ బాబుకు అవార్డులను అందజేశారు. ఉత్తమ ఎన్ క్లోజర్ అవార్డును లయన్ సఫారీ పార్క్‌కు చెందిన నాగిరెడ్డి, ఆయన బృందానికి ప్రదానం చేశారు.

English summary
Nehru Zoological Park added three attractions as it entered 60th year of its formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X