హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో పులికి కరోనా: హైదరాబాద్ జూ సిబ్బంది అలర్ట్, జంతువుల శుభ్రతపై ఫోకస్, శానిటైజేషన్..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి అమెరికాలో ఓ పులికి సోకడంతో కలకలం రేపింది. వెంటనే ఇతర చోట్ల ఉన్న జూ సిబ్బంది కూడా అలర్టయ్యారు. హైదరాబాద్‌లో గల నెహ్రూ జూలజికల్ పార్క్‌లో జంతువులపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోన్నారు. జూ లో ఉన్న జంతువులను.. ముఖ్యంగా పులుల ఆరోగ్యంగా కేర్ తీసుకుంటున్నారు. ఏ పులికి ప్లూ గానీ, దగ్గు వస్తే వెంటనే అలర్టవ్వాలని పశు వైద్యులు, కీపర్లకు స్పష్టంచేసింది.

అలర్ట్.. అలర్ట్...

అలర్ట్.. అలర్ట్...

కరోనా వైరస్ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని సెంట్రల్ జూ అథారిటీ అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ జూ అథారిటీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని నెహ్రూ జులాజికల్ పార్క్ క్యురేటర్ క్షితిజ తెలిపారు. మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని వివరించారు. జూ లో పనిచేసే 150 మందిని థర్మల్ స్కాన్ చేస్తున్నామని వెల్లడించారు.

మార్చి ఫస్ట్ వీక్..

మార్చి ఫస్ట్ వీక్..

జూ సిబ్బంది మొత్తం కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించామని చెప్పారు. మార్చి మొదటి వారం నుంచే జాగ్రత్తగా ఉంటున్నామని చెప్పారు. ఇప్పటికే జూ మొత్తాన్ని నాలుగుసార్లు శానిటైజ్ చేసినట్టు వివరించారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రకటించగా.. మార్చి 22వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించడం లేదని చెప్పారు. జంతువులకు ఆహారం అందించి, శుభ్రపరిచేందుకు మాత్రం సిబ్బందిని మాత్రం అనుమతిస్తున్నామని తెలిపారు.

సిబ్బందికి పర్మిషన్.. క్లీన్...

సిబ్బందికి పర్మిషన్.. క్లీన్...

యానిమల్ కీపర్స్, గార్డెన్ర్స్, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం జూ లో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జూ లో ఉన్న ఎన్ క్లోజర్స్ శుభ్రపరుస్తున్నారని చెప్పారు. పరిశుభ్రంగా ఉంచేందుకు శుభ్రం చేస్తున్నారని.. ప్రతీ జంతువును క్లీన్‌‌గా ఉంచుతున్నారని తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి మాస్క్‌లను అందజేశామని.. వారు విధుల్లో ఉండగా విధిగా మాస్క్ ధరిస్తున్నారని చెప్పారు. ప్రతీ ఉద్యోగికి వారం వారం శానిటైజర్, సబ్బును కూడా అందజేస్తున్నామని తెలిపారు.

ఏడాదికి 30 లక్షల జనం..

ఏడాదికి 30 లక్షల జనం..

విరాసిట్ 10 గ్రాములతో కలిసి జూ ను శుభ్రపరుస్తున్నామని పేర్కొన్నారు. బ్లీచింగ్, లైమ్ కలిసి స్ప్రే చేస్తున్నామని చెప్పారు. జూ బౌండరీ చుట్టూ హైడ్రో క్లోరైడ్ చల్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. విరాసిట్‌తో రాత్రి చుట్టూ గల సముదాయాలను క్లీన్ చేస్తున్నట్టు తెలిపారు. 1963లో నెలకొల్పిన జూ కు.. ఏడాదికి 27 నుంచి 30 లక్షల మంది సందర్శకులు విజట్ చేస్తారు. విశాలమైన ఆవరణలో 155కి పైగా జాతుల జంతువులు ఉన్నాయి.

English summary
With a tiger at a New York Zoo testing positive for COVID-19, the Nehru Zoological Park in Hyderabad sounded an alert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X