హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను టీవీ9 సీఈవోను.. పారిపోలేదు.. అనుహ్యంగా తెరమీదకు వచ్చిన రవిప్రకాశ్..!

|
Google Oneindia TeluguNews

నన్నేవరు అరెస్ట్ చేయలేదు ,నేను ఎక్కడికి పారిపోలేదంటూ ,తనపై వచ్చిన పుకార్లపై ఎవరు ఆందోళన చెందవద్దంటూ టీవీ9 సీఈవో రవిప్రకాశ్ స్పష్టం చేశారు. ఉదయం నుండి ప్రచారం జరుగుతున్నట్టుగా నేను అజ్ఝాతంలోకి వెళ్లలేదంటూ సాయంత్రం ఏడు గంటలకు టీవీ9లో స్టూడియోలో అనుహ్యంగా ప్రత్యక్షమయ్యాడు.

టీవీ9 స్టూడియో రవిప్రకాశ్...

టీవీ9 స్టూడియో రవిప్రకాశ్...

ఈనేపథ్యంలోనే ఉదయం నుండి అనేక వార్తలు ,తెలుగు మీడియాతోపాటు ,జాతీయ చానల్లో తాను తప్పించుకు తిరుగుతున్నాని ,ఎవరో సంతకాన్ని ఫోర్జరీ చేశారని, రవిప్రకాశ్ కోసం పోలీసులు వెతుకున్నారంటూ ,ఎవరికి ఇష్టం వచ్చిన వార్తలను వారు ప్రచారం చేశారని అన్నారు. ఈ వార్తలు ప్రజలకు గందరగోళాన్ని సృష్టించాయని అన్నారు..ఈ వార్తలపై నాతోపాటు టీవీ9 సిబ్బందికి ఉదయం నుండి ఫోన్లు వస్తున్నాయని, ఏం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు...ఇక ఈ విషయంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొన్న సాయంత్రం టీవీ9 లోని 9పీఎం లైవ్ షో నేను పాల్గోన్నానని అది ప్రజలు కూడ చూశారని, అయితే బుధవారం సాయంత్రం ఒక పనిమీద వెళ్లడంతో కార్యాలయానికి రావాడానికి కాస్త ఆలస్యం అయిందని చెప్పారు .

ఈ నేల 16న ఏన్‌సీఎల్‌టీ కోర్టులో కేసు విచారణ

ఈ నేల 16న ఏన్‌సీఎల్‌టీ కోర్టులో కేసు విచారణ

ఇక కేసుకు సంబంధించి ఏన్‌సీఎల్‌టీ కోర్టు లో కేసు ఉందని అది ఈనెల 16న విచారణకు రానుందని తెలిపారు. ఆవివాదాన్ని తీసుకుని కొంత మంది తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అయితే అవాస్తవాలు నిలబడవని, సత్యం మాత్రమే గెలుస్తుందని అన్నారు.జర్నలిజం అంటే సామాజిక భాద్యత అంటూ గందరగోళాన్ని తగ్గించడానికే మీతో మాట్లాడుతున్నట్టు ఐదు నిమిషాల పాటు స్టూడియో ఉన్నారు రవిప్రకాశ్.

నేను టీవీ9 ఫౌండర్ మరియు సీఈవోను

నేను టీవీ9 ఫౌండర్ మరియు సీఈవోను

గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాని ,టీవీ9 ఫౌండర్‌గా సీఈవోగా భాద్యతలు నిర్వహిస్తున్నాని,దేశ వ్యాప్తంగా విజయకేతనాన్ని టీవీ9 ఎగరవేసిందని ,టీవీ9 జర్నలిస్టులు ప్రజల వద్దకు వెళ్లి సమాజహితం కోసం పనిచేస్తున్నారని అన్నారు. టీవీ9 ఎప్పటిలాగే వార్తలు అందిస్తుందని తెలిపారు. ఈనేపథ్యంలోనే రవిప్రకాశ్ ను ఎవరు అరెస్ట్ చేయలేదని, అరెస్ట్ చేయలేరని స్పష్టం చేశారు

జర్నలిజం సామాజిక బాధ్యత...

జర్నలిజం సామాజిక బాధ్యత...

మరోవైపు చానళ్లు కాస్త బాద్యతయుతంగా వ్వవహరించి ఉంటే బాగుండేదని అన్నారు. తప్పిపోయాడు ,పారిపోయాడు, ఉరి తీశాడు అనే వార్తలు పెద్దగా ప్రజాభిమాన్ని పోందవని అన్నారు. ఎవరో ఇచ్చిన డబ్బులు తీసుకొని క్రెడిబిలిటి లేని వార్తలు ప్రచారం చేసి మీరు క్రెడిబిలిటి లేని చానళ్లుగా మిగిలిపోయారని అన్నారు. అయినా ఉదయం నుండి ఇలాంటీ వార్తలు ప్రచారం చేసిన వారందరికి ధన్యవాదాలు అంటూ ముగించారు.

English summary
TV9 CEO Ravi Prakash said that he did not arrested , but he did not go to anayware .it was wrong news telecast other channals he cleared , and came into tv9 live at 7pm today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X