• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అబ్బే.. నాకు ఆ అలవాటే లేదు.. ఆ వాసనంటేనే పడదు..! బోనాల్లో చిందేసిన మంత్రి వివరణ..!!

|

హైదరాబాద్: హలో ఆడియన్స్.. ఇది విన్నారా.. వినకపోతే వినండి. తర్వాత మాత్రం నవ్వుకోకండి. నమ్మండి. మంత్రిపదవిలో ఉన్న సదరు నేత ఎట్టి పరిస్థితిలో అవాస్తవాలు చెప్పరు. అంతా నిజమే చెబుతారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆ మంత్రి గారికి అస్సలు ఆ అలవాటే లేదట. నిజ్జంగా ఆ వాసన కూడా తెలియదట. ఈ విషయాలన్నీ స్వయంగా తానే చెప్పుకురావడం మరో విశేషం. తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలైన బోనాల పండుగలు మొదలయ్యే ఆషాడ మాసం నేటితో ముగియనుంది. ఈ పండుగలను తెలంగాణ వాసులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తుంటారు. పరమ నిష్టగా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు ప్రసాదంగా అందిస్తుంటారు. ఈ సందర్బంగా ఆట పాటలతో ఆనందంగా కేరింతలు కొడతారు. తెలంగాణ మంత్రి వర్యులు కూడా అలాగే ఆడి పాడి అందరిని మెప్పించారు. కాని ఆ సమయంలో మాత్రం అది తీసుకోలేదు, తనకు అసలు అలవాటే లేదని సదరు మంత్రి చెప్పుకు రావడం కొస మెరుపు.

I dont have that habit..!Explanation of the minister for Dance in Bonalu..!!

గత నెల రోజులుగా నగరంలో బోనాల పండుగ ఉత్సాహంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ బోనాల వేడుకను దగ్గరుండి నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో తలసాని హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే ఆ సమయంలో తలసాని మద్యం మత్తులో ఉన్నారని, అందుకే అంత ఉత్సాహంగా డ్యాన్స్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 'మందు బాబులం మేం మందుబాబులం' పాటతో ఆ వీడియో వైరల్ అయింది.

తాజాగా దీనిపై స్పందించిన తలసాని.. ఆ ప్రచారాన్ని ఖండించారు. తనకు మద్యం అలావాటు లేదని.. ఆడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ ఏటా బోనాలకు తాను డ్యాన్స్ చేస్తానని, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చేశానని తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. అంతా బాగానే ఉంది గాని తనకు మందు అలవాటు లేదని చెప్పడమే జనాలకు కామెడీగా అనిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thalasani Srinivas Yadav's dance video has gone viral on social media as part of the Bonala celebrations. In the video, Thalsani is seen dancing loudly. But at the time, Talasani was intoxicated with alcohol and was so enthusiastic dancing became viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more