• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్: అన్నిటికీ సమాధానం చెబుతా..ముందు ఓటువేయి..!!

By Chaitanya
|

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అటు రాజకీయంగా మంత్రులు..ఇటు సినీ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ సమస్యల పైన స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం పైన పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా మోహన్ బాబు స్పందించారు. ఆయన ఈ మేరకు ఇక లేఖ విడుదల చేసారు. మోహన్ బాబు..మా సోదరుడు...అంటూనే మీరు వైసీపీ నేతలకు బంధువులని చెప్పుకుంటారు కదా... ఆన్ లైన్ టిక్కెట్ల పైన స్పందించండి. ఏపీ సీఎంకు చెప్పండి అంటూ పవన్ సెటైరికల్ గా వ్యాఖ్యానించారు.

పవన్ కు ధీటుగా మోహన్ బాబు స్పందన

పవన్ కు ధీటుగా మోహన్ బాబు స్పందన

దీంతో పాటుగా మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల్లో ఫీజులు కూడా ఆన్ లైన్ ద్వారా స్వీకరించాలని అని సూచించారు. దీనికి మోహన్ బాబు స్పందిస్తూ..నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు..నా కంటే చిన్న వాడివి అందుకని ఏకవచనంతో సంబోదించాను అని మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అనటంలో కూడా తప్పు లేదు. చాలా కాలానిని నెమ్మదిగా నన్ను లాగావ్..సంతోషం అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేసారు. తన కుమారుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారని.. ప్రెసిడెంట్ గా నిలబడ్డారని వివరించారు.

ఎన్నికలు అయిన తరువాత

ఎన్నికలు అయిన తరువాత

అక్టోబర్ 10న ఎన్నికలు అయిపోతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత నీవు అడిగిన ప్రతీ మాటకు సమాధానం చెబుతానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈ లోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని అంటూ ..నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణు బాబుకు..అతని ప్యానెల్ కి వేసి వాళ్లను గెలిపించాలని కోరుతున్నాను..థ్యాంక్యూ వెరీ మచ్ ..అంటూ సమాధానం ఇచ్చారు. తెలుగు సినిమా వజ్రోత్సవం వేడుకల సమయం నుంచి వీరిద్దరి మధ్య వివాదం సాగుతోంది. లెజండరీ ఎవరనే అంశం పైన అప్పట్లో మెగా బ్రదర్స్ అండ్ మోహన్ బాబు మధ్య వివాదం జరిగింది.

జగన్ - మోహన్ బాబు సంబంధాలు పైన

జగన్ - మోహన్ బాబు సంబంధాలు పైన

అప్పటి నుంచి ఇద్దరి అభిమానులు సైతం వ్యతిరేకంగా సోషల్ మీడియా కేంద్రంగా అనుకూల - వ్యతిరేక పోస్టులతో హోరెత్తించారు. ఇక, పవన్ తాజాగా తన ప్రసంగంలో జగన్ కుటుంబంతో మోహన్ బాబుకు ఉన్న సంబంధాలను సైతం ప్రస్తావించారు. సినీ పరిశ్రమను ఆదుకోవాలంటూ ఆయన చొరవ తీసుకొని జగన్ తో చర్చించాలని కోరారు. అదే సమయంలో మోహన్ బాబు విద్యా సంస్థల గురించి సెటైరికల్ గా మాట్లాడటం... అదే విధంగా ఫీజులు ఆన్ లైన్ లో తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల తరువాత ఏం జరగనుంది

ఎన్నికల తరువాత ఏం జరగనుంది

దీని ద్వారా మోహన్ బాబు ఫీజుల విషయంలో ఏదో చేస్తున్నారనే అనుమానాలు కలగటానికి ప్రయత్నం చేసారనే అభిప్రాయం కలిగించేలా ఉందనేది మోహన్ బాబు మద్దతు దారుల వాదన. ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన వరుసగా మంత్రులు..ఇప్పుడు మోహన్ బాబు చేస్తున్న కౌంటర్లు అటు సినీ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇది ఎటువైపు దారి తీస్తుందో..ఎటువంటి ముగింపు తీసుకుంటుందో అనేది మరో ఉత్కంఠ భరితంగా మారుతోంది.

English summary
After taking Mohan Babu's name during the speech in a movie function, Pawan was given a counter by the senior actor that he will respond after Maa elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X