హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8 తెలంగాణ వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు.. ఐఏఎస్ అధికారులకు పగ్గాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలోని పలు యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల పదవీకాలం బుధవారం నాటితో ముగిసింది. ఎనిమిది యూనివర్సిటీలకు చెందిన వీసీలు పదవీ విరమణ చేయడంతో కొత్తగా పలువురు ఐఎఎస్ అధికారులను ఇంఛార్జులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంఛార్జ్ వీసీల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ - అరవింద్ కుమార్, జేఎన్‌టీయూహెచ్ - జయేశ్ రంజన్, పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ - వి.అనిల్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం - సి. పార్థసారథి, తెలంగాణ యూనివర్సిటీ - వి.అనిల్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ - డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ - అరవింద్ కుమార్, పాలమూరు యూనివర్సిటీ - రాహుల్ బొజ్జాను నియమించారు.

ias officers as incharge vice chancellors to eight telangana universities

వామ్మో దున్న.. చిన్నారిని ఎత్తిపడేసిందిగా.. పార్కులో బీభత్సం (వీడియో)వామ్మో దున్న.. చిన్నారిని ఎత్తిపడేసిందిగా.. పార్కులో బీభత్సం (వీడియో)

నాలుగు యూనివర్సిటీలకు ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని నియమించగా.. మరో నాలుగు యూనివర్సిటీలకు రెండు చొప్పున ఇద్దరు అధికారులకు కేటాయించారు. అందులో వి.అనిల్ కుమార్‌కు తెలంగాణ యూనివర్సిటీతో పాటు పొట్టి శ్రీరాములు వర్సిటీ కూడా అప్పగించారు. అలాగే అరవింద్ కుమార్‌కు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మహాత్మాగాంధీ వర్సిటీ బాధ్యతలు ఇచ్చారు. కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియామకం జరిగేంత వరకు వీరు ఇంఛార్జ్ వీసీలుగా కొనసాగుతారు.

English summary
IAS Officers appointed as Vice Chancellors for Eight Universities in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X