హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉంటే వాహనం జప్త్పు..!

|
Google Oneindia TeluguNews

మీ వాహనం పై వేల రుపాయాల ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా..?వాటిని డబ్బులు ఉన్నప్పుడు చెల్లిద్ధాం అని భావిస్తున్నారా....? అయితే... మీ ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. వెంటనే వెళ్లి పెండింగ్ ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించండి ..ముందుగా పదికి పైగా చలాన్లు పెండింగ్ ఉంటే మాత్రం వెంటనే చెల్లించండి..లేదంటే పోలీసులు చేతికి చిక్కితే మాత్రం మీరు డబ్బులు చెల్లించేవరకు వాహనం జప్తు చేయడం ఖాయం..

ట్రాఫిక్ పెండింగ్ చాలన్ల కోసం పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. కోట్ల రుపాయల పెండింగ్ చలాన్లను వసూలు చేయడమే ద్యేయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కువగా ఉన్న పెండింగ్ చాలన్లు ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. పదికి పైగా చాలన్లు ఉన్న వాహనాల నెంబర్లను నోట్ చేసుకుని వాటిని గుర్తించి పట్టుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.కాగా నగరంలోని నాంపల్లి, బెగంపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఓక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు వేలకు పైగా చాలన్లు ఉన్నట్టు గుర్తించారు.

If 10 above pending traffic challans, vehicle will be ceased

ఎక్కువగా హెల్మెంట్ లేకపోవడం, కారు సీటు బెల్ట్ పెట్టకోకపోవడంతోపాటు సిగ్నల్స్ జంపింగ్, రాంగ్ పార్కీంగ్ లాంటీ ఉల్లంఘనల్లో నేరుగా పోలీసులు ఆయ సంధర్భాల్లో ఫోటోలు తీసీ వినియోగాదారులకు తెలియకుండానే వారి అడ్రస్‌కు పంపుతున్నారు. రోజు వేలాదీ రుపాయలను జరిమానల రూపంలో వాహనదారులపై విధిస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం సుమారు 150 కోట్ల రుపాయల వరకు విధిస్తున్నారు. కాగా గత 2018లో అయితే ఈ జరిమానాలు ఏకంగా 200 కోట్ల రుపాయల వరకు చేరుకున్నట్టు సమాచారం

English summary
hyderabad traffic police have been conducting special drives for pending challans.If no paid traffic challans vehcle will be ceasedand send courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X