హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్ తిప్పి సంబరపడుతున్నారా ? ఇక మీ పని అయినట్టే..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసుల నుంచి బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ముఖ్యంగా తమ వాహనం నంబర్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మూడు నంబర్లు చిన్నగా రాసి, నాలుగో సంఖ్య పెద్దగా రాయడమో .. లేదంటే మూడు సంఖ్యలు పెద్దగా రాసి .. నాలుగో అంకె చిన్నగా రాస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే తప్ప పోలీసుల కంటికి వాహనం చిక్కదు. దీనిపై ఫోకస్ చేసిన సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే 8 వేలకుపైగా వాహన యాజమానులపై కేసు నమోదు చేశారు. వాహనం రహదారికిపైకి తీసుకొచ్చేముందు నంబర్ ప్లేట్ సరిగా ఉందా లేదో అనే విషయం చూసుకోవాలని కోరుతున్నారు.

ఆకతాయిల చేష్టలు ..

ఆకతాయిల చేష్టలు ..

సిటీలో ట్రాఫిక్ పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి కొందరు ఆకతాయిలు తమ నంబర్ ప్లేట్‌కు మెరుగులు దిద్దుతుంటారు. ఆయా టూ వీలర్‌కు నంబర్ తప్పనిసరి.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ నంబర్ రాయడంలో తమకు తెలిసిన విద్యను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రం, జిల్లా కోడ్ ముగిసిన తర్వాత వచ్చే నాలుగు సంఖ్యలను ఇష్టమొచ్చినట్టు రాసుకుంటారు. అదేనండి పోలీసు కెమెరాకు చిక్కకుండా రేడియం వేస్తున్నారు. నాలుగు అంకెల్లో .. మూడు చిన్నగా రాయిస్తున్నారు. ఒకటి పెద్దగా రాయడంతో కెమెరాకు ఒక్క సంఖ్య సరిగా కనిపిస్తోంది. మరోవైపు మూడు పెద్దగా రాయిస్తూ .. నాలుగో సంఖ్య చిన్న రేడియం వేయిస్తున్నారు. దీంతో ఫోర్త్ లెటర్ కనిపించడం లేదు. దగ్గరి నుంచి అయితే ఓకే కానీ .. దూరం నుంచి ఫోటో చూసి చలానా పంపిస్తే ఒకరికి బదులు మరొకరికి వెళ్తుంది. దీంతో పోలీసులకు కొత్త తలనొప్పి మొదలైంది.

మరొకరికి చలానా ..

మరొకరికి చలానా ..

అలా ఫోటోలు తీసి పంపించడంతో చాలాసార్లు మరొకరికి చలానా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సైబరాబాద్ పోలీసులు నంబర్ ప్లేట్లపై డ్రైవ్ చేపట్టారు. డ్రైవ్‌లో చాలా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నంబర్లే కాదు .. మరికొందరు పూలదండలు వేస్తూ నంబర్‌ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. జూలై, ఆగస్ట్ నెలలో నిర్వహించిన డ్రైవ్‌లో ఇప్పటికే 8154 కేసులు నమోదు చేసినట్టు డీసీపీ తెలిపారు. వారిపై చట్టప్రకారం తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇప్పటికే నోటీసులు జారీచేశామని పేర్కొన్నారు. తప్పుచేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.

హెవీ వెహికిల్స్ కూడా ..

హెవీ వెహికిల్స్ కూడా ..

సాధారణంగా టూ వీలర్ ఆకతాయిలే కాకుండా హెవీ వెహికిల్స్ కూడా నంబర్ ప్లేట్ నిబంధనలు పాటించడం లేదని పోలీసుల డ్రైవ్‌లో బయటపడింది. కొందరు సరకు రవాణా, మరికొన్ని వ్యర్థ పదార్థాలు తీసుకెళ్లేప్పుడు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు. చెత్త బండ్లు తీసుకెళ్లే సమయంలో .. నంబర్ ప్లేట్‌పై చెత్త పడి సరిగా కనిపించడం లేదని చెప్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు సరైన వాహనం గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇకపై ఆయా వాహనాలు రహదారిపైకి వచ్చేముందు మిగతా అంశాలతోపాటు నంబర్ ప్లేట్‌ చూసుకోవాలని కోరుతున్నారు. లేదంటే వాహనాన్ని గుర్తించి సీజ్ చేస్తామని హెచ్చరించారు. యధేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తే .. భారీ జరీనామా తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.

English summary
Some people are making various moves to escape the clutches of traffic police in the city. Most importantly, they are careful not to find their vehicle number. Let the three numbers be written in lowercase and the fourth in the uppercase or else the three digits in uppercase. The police will not see the vehicle unless it is closely examined. Cyberabad police have already filed a case against over 8,000 vehicle owners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X