హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగిస్తే ఇబ్బందులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అందుకే కేసీఆర్: జీవన్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత టీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులంటే నిజంగా ప్రేమ ఉంటే సమ్మెకు వెళ్లిన వెంటనే ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు. వాస్తవానికి కొందరు కార్మికులను విధుల నుంచి తొలగిద్దామనుకొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నిఘా వర్గాల సమాచారం మేరకు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్...ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్...

ఇబ్బందులు అని..

ఇబ్బందులు అని..

ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేది అందజేసింది. దీంతో కేసీఆర్ కార్మికులపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. లేదంటే కొందరు కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేవారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నుకొబడిన ముఖ్యమంత్రి అని అనుకోవడం లేదని మండిపడ్డారు. రాజులా, నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మీరు కదా..

మీరు కదా..

చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సింది ప్రభుత్వమేనని జీవన్ రెడ్డి స్పష్టంచేశారు. అందులో ఏ మాత్రం సందేహానికి తావులేదన్నారు. కానీ కేసీఆర్ మాత్రం వారి పట్ల దయచూపినట్టు ప్రకటనలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఉద్యోగులపై నిజంగా ప్రేమ ఉంటే పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 52 రోజుల ఆర్టీసీ సమ్మెకు, నష్టాలకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. దాదాపు 30 మంది కార్మికుల మరణానికి ప్రభుత్వం కారణం కాదా అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

విధులమాటున..

విధులమాటున..

ఆర్టీసీ చార్జీల పెంపు అంశాన్ని.. కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని చెప్పి సీఎం కేసీఆర్ దృష్టి మళ్లించాడని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో రోజుకు రూ.2.98 కోట్ల అదనపు ఆదాయం వస్తోందని చెప్పారు. ఏడాదికి వెయ్యి కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని వెల్లడించాదు. గత ఆరేళ్ల నుంచి ఆర్టీసీ నష్టాలకు కారణం కేసీఆర్ కాదా అని జీవన్ రెడ్డి నిలదీశారు.

పొరుగు రాష్ట్రాల్లో అలా..

పొరుగు రాష్ట్రాల్లో అలా..

మిగతా రాష్ట్రాల ఆర్టీసీ గురించి జీవన్ రెడ్డి వివరించారు. ఆయా చోట్ల డీజిల్‌పై వ్యాట్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం ఆర్టీసీ సంస్థపై నెట్టివేశారని మండిపడ్డారు. ఆర్టీసీలో కొన్ని రూట్లు ప్రైవేట్‌పరం చేస్తామని ప్రకటించలేదా అని ప్రశ్నించారు. పొరుగురాష్ట్రం ఏపీలో కూడా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. ఆర్టీసీ యూనియన్లపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. యూనియన్లు లేవు, ఉండబోవని ఎలా చెబుతారని జీవన్ ‌రెడ్డి ప్రశ్నించారు.

English summary
if cm kcr, remove rtc workers for duties.. govt will face problem congress leader jeevan reddy said.సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత టీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులంటే నిజంగా ప్రేమ ఉంటే సమ్మెకు వెళ్లిన వెంటనే ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు. వాస్తవానికి కొందరు కార్మికులను విధుల నుంచి తొలగిద్దామనుకొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X