హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YS Sharmila:చెప్పిన పంట వేయడానికి రైతులు బానిసలా..? షర్మిల విసుర్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర 8వ రోజు విజయవంతంగా కొనసాగింది. ఉదయం 10.30 నిమిషాలకు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలోని తిమ్మపూర్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది. రాచలూరు, గాజులపురుగు తండా క్రాస్, బేగంపేట్ గ్రామం, మాధాపూర్, ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడు గ్రామం వరకు సాగింది. చేవెళ్ల పార్లమెంటరీ స్థానం నుంచి బోనగిరి పార్లమెంటరీ స్థానంలోకి పాదయాత్ర అడుగుపెట్టిన సందర్భంగా గ్రామాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్రను విజయవంతం చేశారు. ఎలిమినేడు గ్రామస్తులు బతుకమ్మలను పేర్చి స్వాగతం పలికారు. వైయస్ షర్మిల గారు బతుకమ్మ ఆడారు. ఇవాళ 12 కిలోమీటర్ల దూరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది. మొత్తం 91.6 కిలోమీటర్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది.

సమస్యలు

సమస్యలు

ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల తన భర్తతో కలిసి శ్రీమతి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. షర్మిలతో కి.మీ పాటు నడిచారు. రాచలూరు గ్రామ ప్రజలంతా పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రామం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామం దాటే వరకు రోడ్డంతా జనసంద్రంగా మారింది. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి షర్మిలను కలిశారు. గ్రామం దాటక సైతం కనీసం కిలోమీటర్ మేర జనాలు నిండిపోయారు. నేడు పాదయాత్ర మహేశ్వరం నియోజకవర్గంలో ముగిసి ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలోకి ప్రవేశించింది. ఇబ్రహీంపట్నం ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడు గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మాట ముచ్ఛట నిర్వహించారు. ఎలిమినేడు గ్రామ ప్రజలు తమ సమస్యలను షర్మిలకు వివరించారు.

అద్భుతమేనా..?

అద్భుతమేనా..?

కేసీఆర్ పాలన అద్భుతమని చెబుతున్నారు. నిజంగానే అలా ఉందా...? పెన్షన్లు రాని వారు చేతులెత్తండి అంటే చాలా మంది ఎత్తుతున్నారు. మరి అద్భుతమైన పాలన ఎక్కడుంది...? డబుల్ బెడ్ రూం ఇళ్లుగానీ, కేజీ టు పీజీ చదువులు గానీ, ఫీజు రీయింబర్స్ మెంట్ గానీ వస్తోందా..? పోడు భూములకు పట్టాలిచ్చారా ? ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారా ? ఇంటికొకరికైనా ఉద్యోగం వచ్చిందా ? పేపర్ లాంటి చీర మాత్రం ఇచ్చాడు. అది కేసీఆర్ వాళ్లింట్లో ఎవరూ కట్టుకోరు. ఆ చీర తప్ప ఏమైనా ఇచ్చాడా ? ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు కిరాయిలు, గ్యాస్, కరెంటు బిల్లు అన్ని కట్టుకుంటూ బతుకును భారంగా గడుపుతున్నారు. పాలకులకు మనసు లేదా ? రైతులకు రైతు బంధు ఇస్తామంటున్నారు. కాని ఇచ్చేదాని కంటే పట్టుకునేదే ఎక్కువ. ఇళ్లు లేని వారిని పట్టించుకునే నాథుడే లేడు. వరి పండించవద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నాడు. వరి వేస్కోకపోతే వరి వేస్కోవాలా...? ఇందుకేనా కేసీఆర్ ను ఎన్నుకున్నది. రైతును తనకు నచ్చిన పంట వేసుకోవద్దని చెబుతున్నారు. ఇది న్యాయమేనా ? పాలకులే ఇలా చెబితే ఎలా ? రైతు కూడా కేసీఆర్ కు బానిస కావాల్సి వస్తోంది.

పండగలా

పండగలా

వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేది. ఉచిత వైద్యం కోసం ఆరోగ్య శ్రీ ఇచ్చారు. అయిదేళ్లలో ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదు. అంత గొప్ప పాలన వైయస్ఆర్ అని చెప్పారు. పావలా వడ్డీ రుణాలతో మహిళలు తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. ఇప్పుడు వడ్డీ రూపాయి పావలా పడుతోంది. ఆ రుణాలను ఇంటి ఖర్చులకే వాడుతున్నారని మహిళలు చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఆరేళ్లు, నాలుగేళ్ల పసి పిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే సీఎం ఉరేసుకుని చచ్చిపోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు తలెత్తుకొని తిరగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ లో చలనమే లేదని విమర్శించారు. మహిళల బతుకులు ఎంత భారంగా అవుతున్నాయో నాకు తెలుసు. హమాలీ పని చేసుకొని బతకండమని మంత్రులే నిరుద్యోగులకు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం అన్నింటిని నిర్ణయిస్తూ నియంతల్లా మారుతున్నారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల కోసం పుట్టిన పార్టీ. నేను కేసీఆర్ సర్కార్ ను గద్దె దించి వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిస్తున్నాను.

బాధలు

బాధలు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేవెళ్ల పార్లమెంటరీ కన్వీనర్ కొండా రాఘవరెడ్డి మాట్లాడారు. 8 రోజుల్లో ప్రజల ఇబ్బందులు చూశామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. వైయస్ఆర్ ఉన్నప్పుడు 60 ఏండ్లకే నెలలో మొదటి తేదీన వృద్ధులకు పింఛన్లు ఇచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏండ్లు నిండినా ఎప్పుడు పింఛన్ వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నా ఇరువురికీ పింఛన్ ఇచ్చిన ఘనత వైయస్ఆర్ దేనని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛన్ ఇవ్వడంతో వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు.

మోసం..

మోసం..

డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు తిరిగిన 40 గ్రామాల్లో సుమారు 50 శాతం గ్రామాల్లో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారని, మిషన్ భగీరథ నీళ్లు ఏమయ్యాయని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ పేరుతో గ్రామాల్లోని చెరువుల్లో 10 ట్రాక్టర్ల మట్టి తీసి బిల్లులు తీసుకున్నారని, ఈ పథకంపై విచారణ చేస్తే తండ్రి, కొడుకు, అల్లుడు జైలు పాలవుతారన్నారు. ప్రజలకు సమస్యలే లేవంటున్న కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు.

Recommended Video

ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
నిలదీయండి

నిలదీయండి

ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి త్వరలోనే వస్తుందని తెలిపారు. 2014లో అసెంబ్లీలో తెలంగాణలో ల‌క్ష‌ల‌ కొలువులు ఉన్నాయన్నారని, కానీ ఇప్పటికీ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. కనీసం ఉద్యమకారులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. 108కి ఫోన్ చేస్తే టైర్, డిజిల్ లేదని చెబుతున్నారని, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారన్నారు. రాబోయే రోజుల్లో YSR తెలంగాణ పార్టీని గెలిపిస్తే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని హామీనిచ్చారు. టీఆర్ఎస్ పార్టీని ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చేలా చేస్తామని, ప్రజలకు అండగా ఉంటామన్నారు.

English summary
ysrtp president ys sharmila angry on cm kcr. farmers are slaves she asks to cm kcr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X