హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంబర్ ప్లేట్ మీద రంగు కనబడిందో... మీకు బేడీలు పడినట్లే... !

|
Google Oneindia TeluguNews

నంబర్‌ప్లేట్ మీద రంగుపడినా... నంబర్ కనబడకుండా జిమ్మిక్కులు చేసినా.. ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసే వాహనదారులు ఇక నుండి జాగ్రత్త....రానున్న రోజుల్లో పోలీసులు టాంపరింగ్ చర్యలపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇలాంటీ పనులు చేసిన వాహనదారులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

 పెండింగ్‌లో ఉన్న వేలాదీ ట్రాఫిక్ చలాన్లు..

పెండింగ్‌లో ఉన్న వేలాదీ ట్రాఫిక్ చలాన్లు..

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు తమ కెమేరాల్లో బంధిస్తున్నారు. ఎక్కువగా హెల్మెంట్ లేకపోవడం, కారు సీటు బెల్ట్ పెట్టకోకపోవడంతోపాటు సిగ్నల్స్ జంపింగ్, రాంగ్ పార్కీంగ్ లాంటీ ఉల్లంఘనల్లో నేరుగా పోలీసులు ఫోటోలు తీసీ వినియోగాదారులకు తెలియకుండానే వారి అడ్రస్‌కు పంపుతున్నారు. ఇలా రోజు.. వేలాదీ రుపాయలు జరిమానాలు వాహనదారులపై విధిస్తున్నారు.

నంబర్ కనబడకుండా జిమ్మిక్కులు...

నంబర్ కనబడకుండా జిమ్మిక్కులు...

అయితే ట్రాఫిక్ పోలీసులు ప్రతి చిన్నదానికి ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో వేలాదీ రుపాయాలను జరిమానాలుగా విధించడం, జరిమాన వివరాలను వాహాన దారుడి ఇంటికి పంపడం చేస్తుండడంతో... దీంతో కొంతమంది వాహనాదారులు పోలీసుల ప్రయోగాల నుండి తప్పించుకునే ప్లాన్‌లు వేస్తున్నారు. అసలు వాహనల నంబర్ అగుపడితేనే కదా చలాన్ ఇంటికి వచ్చేదని, భావిస్తున్న వాహన దారులు ఏకంగా ఆ వాహన నంబర్‌నే కనబడకుండా పలు జిమ్మిక్కులు చేస్తున్నారు.

నంబర్ ప్లేటుకు రంగు పూయడం...

నంబర్ ప్లేటుకు రంగు పూయడం...

ఈ నేపథ్యంలోనే కొంతమంది వాహనాదారులు నంబర్ ప్లేట్ కనబడకుండా దానిపై రంగు పూయడం, మరికొంతమంది నంబర్ ప్లేట్‌ను వంచుతున్నారు. మరికొందరు ఒక నంబర్‌ను తొలగిస్తున్నారు. ఇక ఆటోడ్రైవర్లు అయితే ఆటో నంబర్ ప్లేట్ వద్ద నంబర్ కనబడకుండా స్ర్క్రూను బిగిస్తున్నారు. ఇక కొంతమంది యువకులు నెంబరు ప్లేట్ కనబడ కుండా ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీస్తున్నప్పుడు కాళ్లు అడ్డం పెడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు...

పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు...

ఇటివల ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చాలన్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. కోట్ల రుపాయల పెండింగ్ చలాన్లను వసూలు చేయడమే ద్యేయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీంతో పెండింగ్ చలాన్లలో చాలవరకు వాహనం నెంబర్ కనబడకుండా పెండింగ్‌లో ఉన్న చాలన్లు కుప్పలు తెప్పలుగా ఉండడం పోలీసులు గమనించారు. దీంతో వాటిపై ఆరా తీసీని పోలీసులు ఇలాంటీ పనులు చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

English summary
hyderabad traffic police have been conducting special drives for pending challans.If number plate tampered they are issuing non bailable warrant.and also ceaseing vehcle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X