హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వ‌స్త‌ది..! శంషాబాద్ స‌భ‌లో కేటీఆర్.!!

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి/హైద‌రాబాద్: గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే రెండేళ్లలో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారన్నారు.

కాంగ్రెస్ నాయకుడు పి.కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ చేరిక సందర్భంగా శంషాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగంచారు. ఉస్మాన్ సాగర్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయ‌లు కేటాయిస్తామన్నారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు వస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు జోగులాంబ జోన్ లో ఉన్న జిల్లాను ఛార్మినార్ జోన్ లోకి మారుస్తామన్నారు. చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ గెలవాలన్నారు.

If the 16 MPs win, the national status will be anounced to Kaleshvaram ..! KTR in Shamshabad Sabha

తెలంగాణ వచ్చిన తరువాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందదని తెలంగాణ ఉద్యమ సమయంలో లేనిపోని ప్రచారం చేశారు. నాలుగున్నర ఏళ్లలో రంగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.

బస్తీ మే సవాల్ : దమ్ముంటే బరిలోకి దిగు, కేసీఆర్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్ బస్తీ మే సవాల్ : దమ్ముంటే బరిలోకి దిగు, కేసీఆర్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

కేసీఆర్ నాయకత్వం మరింతగా బలపడాలంటే నాయకులు ఇచ్చిపుచ్చుకునే దోరణితో వ్యవహరించాలన్నారు. చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ సమక్షంలో చేరారు. అయినా మేము విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరితే నోటికొచ్చినట్లు విమర్శించడం ఎంత వరకు సబబు అన్నారు. చేరికలు సహజమని, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. 16 మంది పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఉంటే పాలమూరు రంగారెడ్డి పథకానికి నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పరుగెత్తుకుంటూ వస్తుందన్నారు. రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ కు 100 సీట్లకు మించి రావని, అప్పుడు ఒక్కో సీటు ఎంతో కీలకమవుతుందన్నారు. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో టీఆర్ఎస్ పార్టీ తేలుస్తుందన్నార.

English summary
If 16 MPs are in Delhi, Palamuram Ranga Reddy will be funded and the national status for the Kalesvaram project will run towards telangana. . The Rahul-led Congress has no more than 100 seats and then it is going to be very important for each seat. The TRS party will decide who will sit on the Delhi if get 16 lok sabha seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X