హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జస్ట్ 20 మినిట్స్: ఐఐటీ-హెచ్ ఘనత: కరోనా వైరస్ ఉందో? లేదో నిర్ధారణ: సూపర్ టెస్ట్‌కిట్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను కనుగొనడానికి ప్రత్యేకంగా సూపర్ టెస్ట్‌కిట్లను అభివృద్ధి చేసింది. ఈ టెస్టింగ్ కిట్ ద్వారా కరోనా వైరస్ సోకిందా? లేదా అనే విషయాన్ని 20 నిమిషాల్లో నిర్ధారించుకోవచ్చు. 20 నిమిషాల్లోనే కరోనా వైరస్ పరీక్షల ఫలితాలను వెల్లడించేలా ఈ టెస్ట్ కిట్స్‌ను ఐఐటీ-హెచ్ అభివృద్ధి చేసింది. దీని ధర కూడా తక్కువే. దీని ధర 550 రూపాయలేనని ఐఐటీ-హైదరాబాద్ పరిశోధకులు వెల్లడించారు.

ఏపీలో తగ్గని ఉధృతి: మళ్లీ భారీగా సంఖ్యలో కరోనా కేసులు: రోజురోజుకూ..గంటగంటకూ: అదే సీన్ ఏపీలో తగ్గని ఉధృతి: మళ్లీ భారీగా సంఖ్యలో కరోనా కేసులు: రోజురోజుకూ..గంటగంటకూ: అదే సీన్

రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలీమెర్స్ చైన్ రియాక్షన్‌కు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఙానంతో దీన్ని అభివృద్ధి చేసినట్లు ఐఐటీ రీసెర్చర్లు వెల్లడించారు. ఈ టెస్ట్ కిట్లతో పరీక్షలను చేపట్టడానికి భారతీయ మెడికల్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) అనుమతులు అవసరం అని చెప్పారు. వాటిని పరీక్షించడానికి ఐసీఎంఆర్‌కు పంపించామని అన్నారు. అనుమతులు లభించిన వెంటనే పెద్ద సంఖ్యలో కిట్లను తయారు చేస్తామని తెలిపారు. ఈ కిట్లను ఎక్కడికైనా తీసుకుని వెళ్లడానికి కూడా వీలవుతుందని అన్నారు.

IIT Hyderabad develops Covid-19 test Kit for Rs 550 its detects Coronvirus in 20 mins

ఉత్పత్తిని అధికం చేయడం ద్వారా టెస్ట్ కిట్ల ధర మరింత తగ్గించడానికి వీలు అవుతుందని ఐఐటీ-హెచ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలిపారు. భవిష్యత్తులో దీన్ని 350 రూపాయలకే అందించవచ్చని అన్నారు. టెస్టింగ్ కిట్లకు సంబంధించిన పరీక్షలను ఈఎస్ఐ వైద్య కళాశాలలో పరీక్షించామని, ఆశించిన మేర అవి ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. ఈ కిట్ల ద్వారా చేసిన టెస్టులు విజయవంతం అయ్యాయని శివ్ గోవింద్ సింగ్ తెలిపారు.

తమ వెంట తీసుకెళ్లాలా దీన్ని తయారు చేశామని శివ్ గోవింద్ చెప్పారు. దేశీయ పరిజ్ఙానంతో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను అభివృద్ధి చేసిన రెండో అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ-హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంది. ఇదివరకు ఐఐటీ ఢిల్లీ ఇలాంటి టెస్టింగ్ కిట్లను అభివృద్ధి చేసింది. తాజాగా ఐఐటీ-హైదరాబాద్ రూపొందించిన ఈ కిట్స్‌ను విస్తారంగా వినియోగించుకోవడానికి ఐసీఎంఆర్ అనుమతి అవసరం అవుతుంది. ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించిన వెంటనే ఐఐటీ హైదరాబాద్ ల్యాబొరేటరీల్లో పెద్ద ఎత్తున వాటిని తయారు చేస్తామని చెప్పారు.

English summary
New Delhi: A team of researchers at the Indian Institute of Technology (IIT), Hyderabad claims to have developed a first-of-its kind COVID-19 test kit that can deliver results within 20 minutes. The researchers claimed that the alternative test method is not based on the Reverse Transcription Polymerase Chain Reaction (RT-PCR) -- the method currently being used for COVID-19 testing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X