హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నీలోఫర్’ షాకింగ్: చిన్నారులపై అక్రమ క్లినికల్ ట్రయల్స్, తల్లిదండ్రుల ఆందోళన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్పత్రికి వచ్చే చిన్నారులపై కొందరు డాక్టర్లు క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

అత్యవసర సమయంలో ఆస్పత్రికి వచ్చిన సమయంలో చిన్నారులకు ఎలాంటి మందులు ఇస్తున్నారో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దీంతో చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు.

కఠిన చర్యలు తీసుకోవాలంటూ..

కఠిన చర్యలు తీసుకోవాలంటూ..

చిన్నారులపై ప్రయోగాలు చేస్తున్న వారిపై కఠన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, నీలోఫర్ ఆస్పత్రి జూనియర్ల డాక్టర్ల వాదన మరోలా ఉంది. ఆస్పత్రిలో ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ జరగడం లేదని స్పష్టం చేశారు. చిన్నారులు ఆస్పత్రికి వచ్చిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు తమ సంక్షరక్షణలోనే ఉంటారని, తమ ప్రమేయం లేకుండా ఆస్పత్రిలో ఏమీ జరగదని స్పష్టం చేస్తున్నారు.

ఎప్పట్నుంచో క్లినికల్ ట్రయల్స్..

ఎప్పట్నుంచో క్లినికల్ ట్రయల్స్..

చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటామని చిన్నారుల అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని వారికి మందులు ఇస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు. అయితే మరోపక్క నిలోఫర్ లో క్లినికల్ ట్రయల్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయని నిలోఫర్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత చెప్పినట్లు తెలిసింది.

తల్లిదండ్రుల అనుమతి..

తల్లిదండ్రుల అనుమతి..

క్లినికల్ ట్రయల్స్ కోసం గతంలో సూపరింటెండెంట్‌గా ఉన్న రమేష్ రెడ్డి అనుమతులు ఇచ్చారని ఆమె చెబుతున్నారు. అయితే, ఏ చిన్నారి మీద అయినా క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకుని మాత్రమే చేస్తామని చెబుతున్నారు.

ఎలాంటి అవరోధాలు లేవంటూ..

ఎలాంటి అవరోధాలు లేవంటూ..

చాలా కంపెనీలకు సంబంధించిన ప్రయోగాలు తాము ఎథిక్ కమిటీ అనుమతితో చేస్తామని, అంతేగాక, ఇప్పటి వరకు తమకు ఎలాంటి అవరోధలు రాలేదని చెప్పుకొచ్చారు. తమకు ఫార్మా కంపెనీల నుంచి ఎలాంటి వాటా ఉండదని, కొందరు కావాలనే నీలోఫర్ ఆస్పత్రికి అబద్ధపు ప్రచారం చెడ్డ పేరు తెస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఈ వ్యవహారం మీద ఇప్పటికే విచారణ ప్రారంభించిందని వైద్యురాలు అన్నారు.

English summary
The Telangana Health Department on Friday ordered a probe into the alleged illegal clinical trials at government-run Niloufer Hospital here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X